సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ ఇలా చాలా మంది క్యారెక్టర్లు ఈ సినిమాలో కనిపించబోతున్నాయి.

ఇప్పటికే ట్రైలర్ తో సంచలనం సృష్టించిన వర్మ తాజాగా సినిమాలో కేఏ పాల్ పాత్రపై సందించారు. సినిమాలో అతడి పాత్ర కామెడీ పండిస్తుందని పరోక్షంగా వెల్లడించారు. పాల్ ను ఒకేఒక్కసారి కలిశానని, ఆ సమయంలో ఆయన కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నించానని వర్మ చెప్పుకొచ్చారు. కేఏ పాల్ ని కలిసినప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నించానని వర్మ అన్నారు.

హాట్ అందాలతో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ!

 ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఒకసారి ఆయన కాళ్లు పట్టుకోవడానికి ట్రై చేశానని, ఎందుకంటే ఆయన చెప్పే అబద్ధాలు తనను చాలా ఇంప్రెస్ చేశాయని అన్నారు. కేఏ పాల్ లాంటి కలలుగనే వాళ్లు తనకు తెలిసి ఎక్కడా ఉండరని, అందుకే కాళ్లు పట్టుకోవాలనుకున్నానని.. అదే సమయంలో ఆ కాళ్లు లాగితే కిందపడి ఆయన తల పగిలి మైండ్ సెట్ అవుతుందేమోనని చిన్న ఆశ అంటూ చెప్పుకొచ్చారు.

కానీ జీసస్ ను తన మీద ప్రయోగిస్తారని భయపడి ఆగిపోయినట్లు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేఏ పాల్ లాంటి మనిషి ఉనికిలో ఉండడం సాధ్యం కాదని.. ఏదో కామిక్ పుస్తకం నుండి ఓ ఫన్నీ క్యారెక్టర్ ప్రాణం పోసుకొని వచ్చేసిందని.. ఆయన జనాల మధ్య ఉండాల్సిన వ్యక్తి కాదని అన్నారు. కేఏ పాల్ ఏం మాట్లాడినా, ఏం చేసినా కామిక్ బుక్ లో ఓ జోక్ కి ప్రతిరూపమని.. అబద్దాలను కూడా కామెడీగా చెప్పడానికి తెలివి కావాలని, అది కేఏ పాల్ కు ఉందని కామెంట్ చేశారు.