Asianet News TeluguAsianet News Telugu

థ్రిల్లయ్యా.. 'జార్జిరెడ్డి'పై రామ్ గోపాల్ వర్మ కామెంట్

విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఎంతో గుర్తింపు  తెచ్చుకున్న జార్జ్‌ రెడ్డి జీవిత ఆధారంగా సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జార్జ్‌ రెడ్డి సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక సినిమాకు ప్రమోషన్స్ పెరుగుతున్న సమయంలో ఊహించని విధంగా కొన్ని అభ్యంతరాలు వెలువడుతున్నాయి.

ram gopal varma comments on george reddy movie
Author
Hyderabad, First Published Nov 18, 2019, 7:04 PM IST

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఎంతో గుర్తింపు  తెచ్చుకున్న జార్జ్‌ రెడ్డి జీవిత ఆధారంగా సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జార్జ్‌ రెడ్డి సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక సినిమాకు ప్రమోషన్స్ పెరుగుతున్న సమయంలో ఊహించని విధంగా కొన్ని అభ్యంతరాలు వెలువడుతున్నాయి.

ఇకపోతే సినిమాను వీక్షించిన కొంతమంది సినీ ప్రముఖులు సినిమాపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా సోషల్ మీడియా ద్వారా సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశారు.స్పెషల్ షోను వీక్షించిన ఆర్జీవీ సినిమా అదిరిపోయిందని చెప్పారు. జార్జిరెడ్డి పాత్రలో నటించిన సందీప్‌ మాధవ్‌ నటనను చూశాక జార్జ్‌ రెడ్డి తిరిగివచ్చినట్టు అనిపించిందని ప్రశంసలు అందించారు.

అలాగే చిత్ర యూనిట్ కి స్పెషల్ విషెస్ అందించారు.  ఇకపోతే ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేసుకున్నప్పటికీ చివరి నిమిషంలో చిత్ర యూనిట్ క్యాన్సిల్ చేయక తప్పలేదు. పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా ఈవెంట్ లోపాల్గొనాల్సి ఉండగా పోలీసులు అనుమతికి నిరాకరించినట్లు తెలుస్తోంది.

also read: వివాదంలో 'జార్జిరెడ్డి'.. రిలీజ్ అడ్డుకుంటామంటూ హెచ్చరికలు!

"జార్జ్ రెడ్డి"... దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్ రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అటువంటి వ్యక్తి జీవిత చరిత్రతో సినిమా తెరకెక్కుతోంది.

‘దళం’ సినిమా డైరెక్టర్ జీవన్‌రెడ్డి ఈ ‘జార్జిరెడ్డి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై వివాదం చెలరేగుతోంది. ఏబీవీపీ(అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) నేతలు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపించే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

షార్ట్ ఫిల్మ్ లో స్టార్ హీరో కూతురు.. హాలీవుడ్ కలరింగ్

జార్జిరెడ్డిపై కూడా దాదాపు పదిహేను క్రిమినల్ కేసులున్నాయని, ఆయన రౌడీయిజాన్ని కూడా సినిమాలో చూపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏబీవీపీ విద్యార్థులను టార్గెట్ చేస్తూ లేనివి ఉన్నట్లు చూపిస్తే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

జార్జిరెడ్డి హత్య కేసులో ఏబీవీపీ విద్యార్థుల హస్తం లేదని గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుని గుర్తు చేస్తున్నారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు మళ్లీ వివాదం చేయడానికి, ఏబీవీపీ నేతలను తప్పుగా చూపించడానికే ఈ సినిమాను తీస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

అయితే తమ సినిమాలో వాస్తవాలనే చూపిస్తున్నామని.. వ్యక్తిగతంగా ఏ ఒక్కరినీ టార్గెట్ చేయలేదని దర్శకుడు జీవన్ రెడ్డి వెల్లడించాడు. ఈ నెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతారని ప్రచారం చేశారు. కానీ దానికి పోలీసులు అనుమతి నిరాకరించారని తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios