Asianet News TeluguAsianet News Telugu

ఎన్ కౌంటర్ పరిష్కారం కాదు.. రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దిశ కేసులో నిందితులని ఎన్ కౌంటర్ చేయడంపై స్పందించాడు. ఇటీవల రాంగోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రంతో తీవ్ర వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే.

Ram Gopal Varma comments on Disha case encounter
Author
Hyderabad, First Published Dec 6, 2019, 6:17 PM IST

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దిశ కేసులో నిందితులని ఎన్ కౌంటర్ చేయడంపై స్పందించాడు. ఇటీవల రాంగోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రంతో తీవ్ర వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా దిశ కేసులో నిందితులని ఎన్ కౌంటర్ చేయడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 

రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో.. 'సమాజంలో నెలకొన్న ఎమోషన్స్ ని, అగ్రహావేశాలని కంట్రోల్ చేయడానికి పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా చట్టాలని, నిబంధలని అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ కౌంటర్స్ వల్ల న్యాయం జరగదు.. అవి పరిష్కారమార్గం కాదు' అని పేర్కొన్నాడు. 

నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి : చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు!

దిశ కేసులో నిందితులని పోలీసులు ఎన్ కౌంటర్ చేసినందుకు సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. దిశ పై అత్యాచారం, హత్య జరిగిన సమయంలో వర్మ నిందితులని శునకాలు అని సంభోదించారు. నిందితులని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. 

ఆడపిల్లల గురించి ఆలోచించాలంటేనే భయపడాలి.. రేణుదేశాయ్ కామెంట్స్!

నాగార్జున, బాలకృష్ణ. చిరంజీవి, రవితేజ, నాని, కాజల్ అగర్వాల్, మంచు మనోజ్, నితిన్, అఖిల్, సమంత లాంటి సెలెబ్రిటీలంతా నిందితులని ఎన్ కౌంటర్ చేయడంపై పోలీసులని అభినందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios