వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. వర్మ చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. ఎలాంటి విషయం గురించి అయినా వర్మ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో సెటైర్లు పేల్చేస్తాడు. కొన్ని రోజుల క్రితం.. కరోనా నువ్వు మనుషులని విడిచిపెట్టు లేదంటే చస్తావ్ అని వార్నింగ్ ఇచ్చాడు. 

రోజు రోజుకు కరోనా ఎక్కువవుతుండడంతో మనుషులనే వైరస్ ని నాశనం చేయడానికి దేవుడు సృష్టించిన వాక్సిన్ కారోనా అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా వర్మ తన చిరకాల ప్రత్యర్థి కేఏ పాల్ పై పడ్డాడు. కేఏ పాల్ ని ఎద్దేవా చేస్తూ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 

పర్సనల్ లైఫ్ కెలుకుతారు.. ఒక్క శాతం కూడా భరించను : రెజీనా

కరోనా తగ్గడానికి ప్రతి ఒక్కరూ దేవుని ప్రార్థనలు చేయాలని కేఏ పాల్ ఓ వీడియో ద్వారా తెలిపాడు. తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నందువల్ల ఈ సూచనలు ఇస్తున్నట్లు పాల్ చెప్పుకొచ్చాడు. కరోనా నివారణకు అవసరమైతే ప్రభుత్వాలు తన భవంతులు ఉపయోగించుకోవచ్చని పాల్ పేర్కొన్నాడు. 

మోహన్ బాబు బర్త్ డే: వైరల్ అవుతున్న మనోజ్ పోస్ట్.. చిరంజీవి సెటైర్

దీనికి వర్మ స్పందిస్తూ.. అరె కేఏ పాలు ఈ సుత్తి సలహాలు ఇచ్చేబదులు నీ దేవుడితో చెప్పి కరోనా లేకుండా చేయొచ్చు కదరా సుబ్బారావు.. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీనే ఉంటే నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా తెప్పించు నీ ఎంకమ్మ అని వర్మ ట్వీట్ చేశాడు.