అందం, అభినయం అన్నీ ఉన్న నటి రెజీనా. తన గ్లామర్ తో యువతని ఆకర్షించడమే కాదు.. నటనతో ప్రేక్షకులని సైతం కట్టిపడేస్తుంది. రెజీనా చివరగా తెలుగులో నటించిన చిత్రం ఎవరు. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఆ మూవీలో రెజీనా పెర్ఫామెన్స్ నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. 

నెగిటివ్ షేడ్స్ లో సైతం రెజీనా అద్భుతంగా నటించింది. ఎవరు తర్వాత రెజీనాని మరిన్ని ప్రయోగాత్మక పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం రెజీనా నేనేనా అనే విభిన్నమైన చిత్రంలో నటిస్తోంది. మహారాణి గెటప్ లో ఉన్న రెజీనా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో కూడా రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. 

ఇదిలా ఉండగా రెజీనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తానూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంపై ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తాను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నపటికీ అభిమానులతో చాట్ చేసేందుకు ఇష్టపడనని తెలిపింది. ఎందుకంటే ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా నెగిటివిటినే కనిపిస్తోంది. 

హాట్ ఫోటోస్: సాహో బ్యూటీ ఒంపు సొంపులు.. కుర్రాళ్లకు నయనానందమే

కొందరు అసభ్యకరమైన కామెంట్స్ చేస్తుంటారు. అది నాపై చాలా ప్రభావం చూపుతుంది. నేను ఎక్కువగా మానసిక ప్రశాంతనని కోరుకుంటాను. ఇలాంటి కామెంట్స్ చూస్తే నాకు భాదగా అనిపిస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు  రెజీనా పేర్కొంది. 

నేను ఒక్క శాతం కూడా నెగిటివిటి భరించలేను. అభిమానులతో చాట్ చేయడం, వారితో ముచ్చటించడం మంచిదే. కానీ కొంతమంది వ్యక్తిగత విషయాల్ని అడుగుతారు. అది ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు సోషల్ మీడియా లేని రోజుల్లో సెలెబ్రిటీల జీవితాలు ప్రజలకు ఒక మిస్టరీ. అలాంటి పరిస్థితులు తాను కోరుకుంటున్నట్లు రెజీనా పేర్కొంది.