మరికొన్ని గంటల్లో 2019 ముగిసిపోనుంది. కొత్త ఏడాది 2020లోకి ఎంటర్ కాబోతున్నాం. ఈ ఏడాదిలో చాలా మంది హీరోలు సక్సెస్ లతో బాక్సాఫీస్ ని షేక్ చేశారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా 'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అలాంటి హీరోని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. దానికి కారణం లేకపోలేదు. 'రంగస్థలం' సినిమా తరువాత రామ్ చరణ్ ఎలాంటి సినిమాలో నటిస్తాడోనని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. వారందరికీ 'వినయ విధేయ రామ' సినిమాతో పెద్ద షాకే ఇచ్చాడు చరణ్. బహుసా దర్శకుడు బోయపాటి కథను ఓ రేంజ్ లో వివరించి ఉంటాడు.

కొత్త లుక్ లో అదరగొడుతున్న 'మిస్ ఇండియా' కీర్తి!

కానీ అది మేకింగ్ లో పెద్ద దెబ్బ కొట్టింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాని సోషల్ మీడియాలో ఎంతగా ట్రోల్ చేశారంటే.. ఈ ఏడాది టాలీవుడ్ టాప్ ట్రోలింగ్ లిస్ట్ లో మొదటి ప్లేస్ సొంతం చేసుకుంది. డైరెక్టర్ బోయపాటిని, రామ్ చరణ్ ని బాగా ట్రోల్ చేశారు.

సినిమాలో యాక్షన్ సన్నివేశాలను సోషల్ మీడియాలో ఏకిపారేశారు. హీరో.. విలన్ గ్యాంగ్ లో ఓ వ్యక్తి తలనరికితే.. దాన్ని గడ్డలు తన్నుకుపోవడం, హీరో ట్రైన్ ఎక్కి భారత్ నుండి నేపాల్ బార్డర్ చేరుకోవడం లాంటి సీన్స్ సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురయ్యాయి.

'రంగస్థలం' లాంటి సినిమా తరువాత రామ్ చరణ్ ఈ కథకి ఎలా ఓకే చెప్పడంటూ అందరూ ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ 'RRR' సినిమాలో నటిస్తున్నారు. 2020 జులైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.