ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజిగా ఉన్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఓకే చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సాధారణంగా పూర్తి స్క్రిప్టు ఓకే చేయని రామ్ చరణ్ ..కేవలం స్టోరీ లైన్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు అనీల్ రావిపూడి. ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అంటూ భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ దుమ్ము రేపిన అనీల్ పై ఇండస్ట్రీలోని అందరి దృష్టీ పడింది. లాస్ట్ సంక్రాంతికి ఎఫ్ 2, ఈ సంక్రాంతికి మహేష్ తో చిత్రం హిట్స్ హీరోలను అనీల్ వైపు తిరిగేలా చేసాయి. దాంతో స్వయంగా చరణ్ పిలిచి తనకో మాస్ ఎంటర్టైనర్ చేయమని అనీల్ కు పురమాయించినట్లు సమాచారం.

బోయపాటిని నమ్మి చేసిన `వినయ విధేయ రామ` డిజాస్టర్ చరణ్ ని ఇంకా వెంటాడుతూనే ఉంది. దాంతో సోలోగా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ క్రెడిట్ ..రాజమౌళి, ఎన్టీఆర్ పంచుకుంటారు. దాంతో చాలా మంది దర్శకులు చరణ్ కి స్క్రిప్ట్ లు వినిపించారు.  అయితే సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తో  అనీల్ రావిపూడి ఖరారు అయ్యారు.

ప్రభాస్ ఎంతో డబ్బు సంపాదించుకుని ఉండొచ్చు.. బాహుబలిపై అల్లు అర్జున్!

చరణ్ మాస్ ఇమేజ్ కు తగ్గ కమర్శియల్ స్టోరీ తో నెక్ట్స్ లెవిల్ కు వెళ్లాలని అనీల్ రావిపూడి భావిస్తున్నారు. కాకపోతే ఈ సారి కథలో చిరుని, రామ్ చరణ్ కలిపి చేయాలనే ఆలోచనతో అనీల్ ఉన్నాడని అంటున్నారు. అయితే చరణ్ మాత్రం ఇద్దరు కలిపి చేసేటంత బలమైన కథ అయ్యిండాలని, ఏదో కామెడీ కోసం కలవటం కష్టమని చెప్పారట.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న విషయం ప్రకారం అనీల్ ఇప్పటికే ఓ స్టోరీ లైన్ ని రామ్ చరణ్ కు చెప్పి ఓకే చేయించుకున్నారు. అనీల్ ని పూర్తి స్క్రిప్టు నేరేట్ చేయమని కోరినట్లు సమాచారం. దాంతో అనీల్ తన టీమ్ తో కూర్చుని స్క్రిప్టు వర్క్ మొదలెట్టారట. ఫన్ తో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఉండాలని, అలాగని శ్రీను వైట్ల తో చేసిన బ్రూస్ లీ టైప్ సినిమా కాకూడదని హెచ్చరించాడట.

ఇక రామ్ చరణ్ చిత్రంతో సక్సెస్ అందుకుంటే అనీల్ కి మెగా కాపౌండ్ లో బెర్త్ కన్ఫమ్ చేసేనట్లే. ఎందుకంటే ఎంటర్ టైన్ మెంట్ స్క్రిప్టులకు మెగా కాంపౌండ్ పెద్ద పీట వేడయంలో ముందుంటంది.