సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి మనవడు గల్లా పద్మావతి, జయదేవ్ దంపతుల కుమారుడు గల్లా అశోక్ అతి త్వరలో టాలీవుడ్ కి హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. భలేమంచి రోజు, శమంతకమణి, దేవదాసు వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తొలిసారి జయదేవ్, అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో రేపు ఉదయం గం.11 :15 ని.లకు పలువురు టాలీవుడ్ సినిమా ప్రముఖుల మధ్య ఎంతో ఘనంగా జరుగనుంది.

రజినీ, కమల్ లతో వైరముత్తు.. మండిపడ్డ సింగర్ చిన్మయి!

ఇక ఈ కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టిన భామ నిధి అగర్వాల్ అశోక్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతం, రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తుండగా, న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది!