ప్రముఖ సాహితీ రచయిత వైరముత్తుపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అతడిపై ఎలాంటి ప్రభావం చూపలేదని గాయని చిన్మయి అసహనం వ్యక్తం చేశారు. 'మీటూ' ఉద్యమం సమయంలో చిన్మయి.. వైరముత్తుపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం ఓ కార్యక్రమంలో వైరముత్తు తన అనుచురుడిని ఆమె వద్దకు పంపి.. గదికి రమ్మని పిలిచాడని ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది.

ఆమెతో పాటు పలువురు మహిళలు వైరముత్తు తమను వేధించాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో చిన్మయిని పలు కారణాలతో డబ్బింగ్ సంఘం నుండి నిషేధించారు. ఇలాంటి ఘటనలు జరుగుతునన్నా.. చిన్మయి మాత్రం తన పోరాటాన్ని ఆపడం లేదు.

ఈ చిన్న సినిమాలే బాక్సాఫీస్ ని షేక్ చేశాయి!

అసలు విషయంలోకి వస్తే.. రీసెంట్ గా అల్వార్ పేటలో కమల్ హాసన్ నిర్వహించిన కె.బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రజినీకాంత్ తో పాటు వైరముత్తు కూడా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్,రజినీకాంత్ తో కలిసి వైరముత్తు తీసుకున్న ఫోటోను చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిందితుడు వైరముత్తు వేడుకలకు హాజరవుతుంటే.. బాధితురాలిని ఇండస్ట్రీ నుండి నిషేధించారని అసంతృప్తి వ్యక్తం చేసింది.

మీటూ ఉద్యమం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషుల జీవితాలను నాశనం చేసిందని, కెరీర్ ని దెబ్బ తీసిందని, అవమానభారంతో ఆ పురుషుడు బయట తన ముఖాన్ని కూడా చూపించలేకపోతున్నాడు కానీ వైరముత్తు మాత్రం డీఎంకే కార్యక్రమాలు, ఐఏఎస్ అధికారుల శిక్షణా కార్యక్రమాలు, తమిళ భాష వేడుకలు, పుస్తక ఆవిష్కరణలు, సినిమా వేడుకలకు అతిథిగా వెళ్తున్నాడని విమర్శలు చేసింది.

మీటూ ఆరోపణలు వైరముత్తుపై ఎంత మాత్రం ప్రభావం చూపలేదని.. కానీ తనను మాత్రం చిత్రపరిశ్రమ నుండి  నిషేధించారని అసంతృప్తి వ్యక్తం చేసింది. తమిళనాడు చిత్ర పరిశ్రమ పెద్దలు బాగా న్యాయం చేశారని.. లైంగిక వేధింపులు చేసిన వ్యక్తితో పార్టీ.. బాధితురాలిపై నిషేధం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.