సూపర్ స్టార్ మహేష్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది విడుదలైన మహర్షి, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలుగా నిలిచాయి. మహేష్ బాబు ప్రస్తుతం కొంత విరామం తీసుకుని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. మహేష్ తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉండబోతోంది. 

ఇదిలా ఉండగా నేడు మహేష్ బాబు, నమ్రత దంపతులు 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్, నమ్రత పరస్పరం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా నమ్రతతో కలసి ఉన్న అందమైన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. 

ఈ ఫొటోలో నమ్రత గట్టిగా మహేష్ ని కౌగలించుకుని ఉంది. మహేష్ కాస్త ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ ఫోటో నెటిజన్లని విపరీతంగా ఆకర్షిస్తోంది. మరోవైపు నమ్రత కూడా ఇన్స్టాగ్రామ్ లో మహేష్ తో కలసి ఉన్న ఓ ఫోటోని పంచుకుంది. 'ఓ అమ్మాయి కోరుకునే పరిపూర్ణమైన జీవితాన్ని నాకు అందించావు.. మన పిల్లలు, ఇల్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. హ్యాపీ 15 మహేష్' అని నమ్రత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

రాముడిపై కామెంట్స్.. అడ్డంగా బుక్కైన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్!

అభిమానులు కూడా మహేష్, నమ్రత దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2005లో మహేష్, నమ్రత ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి సినిమాటిక్ తరహాలో జరిగింది. మహేష్ కంటే నమ్రత వయసులో ఐదేళ్లు పెద్ద. వంశీ చిత్రంలో జంటగా నటించిన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కేవలం కుటుంబ సభ్యులు, కొంత మంది స్నేహితుల సమక్షంలో మహేష్, నమ్రత వివాహం జరిగింది. ఆ తర్వాత కృష్ణ మీడియాకు అధికారికంగా ప్రకటించారు.