దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం 'RRR'. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, చరణ్ లు దాదాపు ఏడాదిన్నర నుండి రెండేళ్ల పాటు సమయం కేటాయించారు. ఇద్దరు స్టార్ హీరోలు రెండేళ్ల కాల్షీట్స్ అంటే 
మామూలు విషయం కాదు.

మరి వారికి ఏ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారనే ఆసక్తి అభిమానుల్లో కలిగింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్, చరణ్ లకు చెరొక పాతిక కోట్ల  రెమ్యునరేషన్  ఇస్తున్నారని అంటున్నారు. దీంతో పాటు ఎక్కువ కాలం సినిమా కోసం టైం కేటాయించాల్సి వస్తున్న కారణంగా నెలకు పది లక్షల చొప్పున ఇద్దరు హీరోలకు షూటింగ్ ఖర్చుల కోసం కేటాయించినట్లు తెలుస్తోంది.

(Also Read) RRR: అనుష్క గెస్ట్ రోల్.. క్లారిటీ వచ్చేసింది!

షూటింగ్ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు కూడా ఇద్దరు హీరోలకు పదేసి లక్షల చొప్పున ఇస్తూ వెళ్లడానికి ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే రెమ్యునరేషన్ కాకుండా ఇది అదనంగా వస్తోన్న డబ్బన్నమాట. మరి డైరెక్టర్ గా పని చేస్తోన్న రాజమౌళికి ఎంత రెమ్యునరేషన్ ఉంటుందనే విషయంపై ఆరా తీయగా.. అతడికి అసలు పారితోషికం లేదని.. లాభాల్లో సగం వాటా ఆయనకే అని నిర్మాత దానయ్యతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

సినిమాను ముందుగా అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయడం, లాభాల్లో సగం వాటా తీసుకోవడమనేది ఒప్పందంగా తెలుస్తోంది. రాజమౌళికి ఇచ్చే వాటాలోనే ఆయన కుటుంబ సభ్యుల రెమ్యునరేషన్ లు కూడా ఉంటాయని తెలుస్తోంది.

దాదాపు బాహుబలి చిత్రానికి పనిచేసిన టీం ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం కష్టపడుతోంది. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న చిత్రాన్ని విడుదల చేస్తారు.