ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ RRR విడుదల అయ్యే వరకు సినిమాపై రూమర్స్ ఏ మాత్రం తగ్గేలా లేవు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇద్దరు స్టార్ హీరోలు వెండితెరపై కనిపిస్తుండడంతో అంచనాల డోస్ రోజురోజుకి తారా స్థాయికి చేరుకుంటోంది. అందులోను స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాను తెరకెక్కిస్తుండడంతో సినిమా దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ఒకే  తెరపై కనిపిస్తుండడంతో సినిమా రిలీజ్ డేట్ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇకపోతే సినిమాలో ఇటీవల పాత్రలకు సంబందించిన గాసిప్స్ తెగ హల్ చల్ చేశాయి. ముఖ్యంగా సినిమాలో అనుష్క గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నట్లు మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. 

also read: చరణ్ vs తారక్.. RRR స్టార్స్ టోటల్ బాక్స్ ఆఫీస్ ట్రాక్

అయితే చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం సినిమాలో అనుష్క నటించడం లేదని తెలుస్తోంది. చిత్ర యూనిట్ సినిమాను మొదలుపెట్టిన రోజే కొంత మంది నటీనటులను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది.  బాలీవుడ్ నుంచి అజయ్ దేవ్ గన్ - అలియా భట్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే తమిళ్ యాక్టర్ సముద్రఖనికూడా ఒక మెయిన్ రోల్ లో నటించబోతున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చారు.

ఇక రీసెంట్ గా అనుష్క ఒక మహారాణి పాత్ర కోసం ఫిక్స్ చేసినట్లు టాక్ వచ్చింది. త్వరలోనే చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనోన్స్మెంట్ ఇవ్వనున్నట్లు కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ అవన్నీ అబద్ధాలని తేలిపోయింది.  

ప్రస్తుతం చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రకు జోడిగా మరొక హీరోయిన్ ని ఫిక్స్ చేయాల్సి ఉంది. ఆ పాత్రపై కూడా రూమర్స్ వస్తున్నప్పటికే చిత్ర యూనిట్ ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.