కొంతకాలంగా సహాయ దర్శకుడితో ప్రేమాయణం సాగిస్తున్న ఓ నటి అతడితో కలిసి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నటి తల్లి, అమ్మమ్మ విషయం తాగడంతో అమ్మమ్మ మృతి చెందిన ఘటన బుధవారం మండ్య జిల్లాలో వెలుగు చూసింది.

జిల్లాలోని మద్దూరు తాలుకా మెళ్లహళ్లి గ్రామానికి చెందిన నటి విజయలక్ష్మీ తన తల్లితండ్రులు, అమ్మమ్మతో కలిసి చెన్న పట్టణంలో జీవిస్తోంది. కన్నడలో పలు చిత్రాల్లో నటించిన విజయలక్ష్మీ కొద్దిరోజులుగా తుంగభద్ర అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సమయంలో సహాయ దర్శకుడిగా పని చేస్తోన్న అంజప్పతో ఆమెకి పరిచయం ఏర్పడింది.

ఎన్నిసార్లు అబార్షన్ అయ్యిందో, నా భర్త లంచం ఇచ్చాడు : కాజోల్

అది ప్రేమగా మారడంతో గత నెల 15న అతడితో కలిసి వెళ్లిపోయింది. అలా వెళ్లిన పదిహేను రోజులకు మళ్లీ ఇంటికి తిరిగొచ్చి ఇకపై ఇలాంటి తప్పులు చేయనని చెప్పడంతో తల్లితండ్రులు విజయలక్ష్మిని క్షమించారు. ఇది జరిగిన కొద్దిరోజులకే మళ్లీ విజయలక్ష్మి.. అంజప్పతో కలిసి వెళ్లిపోయింది.

దీంతో అంజప్ప అడ్రెస్ కనుక్కొని విజయలక్ష్మి తండ్రి విచారించగా.. అక్కడకి రాలేదని సమాధానం వచ్చింది. మరోపక్క కొత్త సినిమాలకు సంబంధించిన విజయలక్ష్మికి అడ్వాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలు ప్రతీరోజు ఇంటికి వస్తూ దుర్భాషలాడసాగారు.

ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన విజయలక్ష్మీ తల్లి, అమ్మమ్మ విషం తాగారు. దానికి ముందు తమ మరణానికి కారణం అంజప్ప అని వీడియో చిత్రీకరించారు. వెంటనే వారిని హాస్పిటల్ కి తరలించగా.. విజయ లక్ష్మి అమ్మమ్మ మరణించగా..  ఆమె తల్లి చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.