పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే 'పింక్' సినిమా రీమేక్ లో నటించడానికి పవన్ ని ఒప్పించారని సమాచారం. ఇది ఇలా ఉండగా.. మరోపక్క దర్శకుడు క్రిష్ తో సినిమాకి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి.

ఇప్పుడు రామ్ చరణ్ సైతం పవన్ కళ్యాణ్ కోసం ఓ కథని వెతుకుతున్నారని తెలుస్తోంది. కొంతమంది యువ రచయితలు, దర్శకుడు చెబుతోన్న కథలను చరణ్ వింటున్నాడట. ఆ కథలు వింటోంది తనకోసం కాదని.. పవన్ కళ్యాణ్ కోసం సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇప్పటివరకు రెండు భారీ సినిమాలు వచ్చాయి.

సల్మాన్ ఖాన్ పుట్టినరోజున.. బిడ్డకు జన్మనిచ్చిన అర్పిత ఖాన్!

చిరు హీరోగా ఈ రెండు సినిమాలను నిర్మించారు. చిరు, కొరటాల సినిమాని కూడా ఇదే బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ బ్యానర్ పై కేవలం చిరంజీవితో మాత్రమే సినిమా తీస్తానని గతంలో రామ్ చరణ్ ఓ సందర్భంలో చెప్పారు.

అయితే ఇప్పుడు బాబాయ్ తో కూడా సినిమా తీయాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. బాబాయ్ తో ఓ సినిమా నిర్మించడంతో పాటు బాబాయ్ సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై తను ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు రామ్ చరణ్. 'బాబాయ్ ప్రొడక్షన్ లో నేను ఓ సినిమా చేస్తా' అని ఇదివరకే చరణ్ ప్రకటించాడు.

ఈ రెండు సినిమాలను 2020 లోనే పట్టాలెక్కించాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ వర్కవుట్ అయితే క్రేజ్ మాములుగా ఉండదు. అయితే దానికి తగ్గట్లు కథలు కూడా సెట్ అవ్వాలి. అందుకే మంచి కథను సెట్ చేయడం కోసం తనవంతు కృషి చేస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ హీరో రాజమౌళి రూపొందిస్తోన్న 'RRR' సినిమాలో నటిస్తున్నాడు.