కండల వీరుడు సల్మాన్ ఖాన్ శుక్రవారం రోజు తన 54వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాడు. సల్మాన్ ఖాన్ బర్త్ డే సందర్భంగా అతడి ఫ్యామిలిలో సంతోషం రెట్టింపైంది. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీలోకి మరో కొత్త మెంబర్ వచ్చారు. సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ రెండవసారి తల్లి అయింది. 

గర్భవతిగా ఉన్న అర్పిత శుక్రవారం రోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అర్పిత ఖాన్, ఆయుష్ దంపతులకు ఇప్పటికే మూడేళ్ళ కొడుకు ఉన్నాడు. అర్పిత కొడుకు పేరు ఆహిల్. ఇప్పుడు పాపాయి జన్మించడంతో సల్మాన్ ఫ్యామిలీ సంతోషంలో మునిగి తేలుతోంది. 

సల్మాన్ ఖాన్ తన మేనల్లుడు ఆహిల్ తో ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసేవి. ఇప్పుడు మేనకోడలు పుట్టడంతో కండలవీరుడి సంతోషం మాటల్లో చెప్పలేం. అర్పిత భర్త ఆయుష్ తమకు పాప జన్మించిన సంగతిని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. పాపకు 'ఆయత్ శర్మ' అని పేరు కూడా పెట్టేశారు. 

ఆయుష్ శర్మ బాలీవుడ్ లో నటుడిగా కొనసాగుతున్నాడు. ఆయుష్ శర్మ చివరగా లవ్ రాత్రి అనే చిత్రంలో నటించాడు. సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ దబంగ్ 3 ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

We’ve been blessed with a beautiful baby girl. Thank you so much for all the love and blessings for Ayat Sharma

A post shared by Aayush Sharma (@aaysharma) on Dec 27, 2019 at 12:33am PST

2014లో అర్పిత ఖాన్, ఆయుష్ ల వివాహం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగింది. 2016 మార్చి 30న అర్పిత, ఆయుష్ దంపతులకు కుమారుడు ఆహిల్ జన్మించాడు.