దే దే ప్యార్‌ దే’తో హిందీలో వందకోట్ల హీరోయిన్ల క్లబ్‌లో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ చేరటంతో ఆమెను అక్కడ వాళ్ళు బాగానే చూసుకుంటన్నారు. వసూళ్లు వచ్చినప్పటికీ... విమర్శకులను, ఓ వర్గం ప్రేక్షకులను ఆ చిత్రం మెప్పించలేదు. కానీ, ‘దే దే ప్యార్‌ దే’ టీమ్ మాత్రం తమ సినిమా హిట్‌ అనటం ప్లస్ అయ్యింది. ఆ ఊపులోనే.. ‘మర్‌జావా’తో మరోసారి రకుల్‌ ముందుకు వచ్చేసింది. ఈ వారం రిలీజైన ఈ సినిమా కలెక్షన్స్ సోసోగా ఉన్నాయి.

also read టబు హాట్ పిక్స్.. @48లో కూడా తగ్గని అందాల ఘాటు

‘మర్‌జావా’ టీమ్ వాళ్ళు మా సినిమా కలెక్షన్స్ అదిరిపోతున్నాయని చెప్పుకోవటమే కానీ అంత గొప్పగా ఫెరఫార్మ్ చేయటం లేదు. దాంతో రకుల్ కు బాలీవుడ్ లోనూ చుక్కెదురు అయ్యింది.  టి సిరీస్‌తో కలసి దర్శకుడు నిఖిల్‌ అడ్వాణీ నిర్మించిన ఈ చిత్రానికి ‘ప్రేమలో చావడం, చంపడం కూడా ఉంటుంది’అనే ట్యాగ్ లైన్.  ‘ప్రేమ, మృత్యువు మధ్య జరిగే ఉత్కంఠభరితమైన ఆట ఇది’ , ‘నేను చావడానికి సిద్ధం. చంపగలిగితే చంపు’ అంటూ రకరకాలుగా ప్రమోట్ చేసినా పెద్దగా కలిసిరాలేదు.

మన్మథుడు 2లో నాగార్జునతో రొమాన్స్‌ చేసిన రకుల్ ప్రీతి సింగ్ తెలుగులో ఓ రేంజిలో ట్రోలింగ్ ఎదుర్కొంది. సర్లే చేసేదేముంది అని హిందీలో 'మర్జావా' అనే సినిమా చేస్తే అక్కడా అదే పరిస్దితి. ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించింది. ఇప్పుడా చిత్రాన్ని విమర్శకులు ఏకిపాడేస్తున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ లాంటి పేరున్న హీరోలు నటించిన చిత్రమే అయినా భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. దాంతో అక్కడ కూడా ఐరన్ లెగ్ అన్న స్దాయిలో ట్రోలింగ్ మొదలైంది.నిజానికి ఈ చిత్రంలో రకుల్‌ మెయిన్‌ హీరోయిన్‌ కాదు ...కానీ ఆమె ఖాతాలో అయితే మరో ఫ్లాప్‌ నమోదైపోయింది.

హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో రకుల్‌కు రెండో చిత్రమిది. తొలి చిత్రం ‘అయ్యారీ’ అట్టర్‌ఫ్లాప్‌. అంతకు ముందు ‘యారియాన్‌’ ఆమెకు అవకాశాలు తీసుకురాలేదు. దాంతో.., ‘మర్‌జావా’ పైనే ఆశలు పెట్టుకుంది. ఇందులో రకుల్‌ది ప్రత్యేక పాత్రే! అలాగే అయితే ఆమెపై తెరకెక్కించిన ఓ సాంగ్ ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేసింది. అయితే సినిమా హిట్టయితేనే కదా ..ఏదైనా ప్లస్ అయ్యేది.. రకుల్‌కు అక్కడ మరిన్ని అవకాశాలు వచ్చేది.