టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం తెలుగులో హీరో నితిన్ తో కలిసిఓ సినిమాలో నటిస్తోంది. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఈ సినిమాను రూపొందించనున్నారు.

తమిళంలో ఆమె నటించిన 'దేవ్', 'ఎన్జీకే' వంటి సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న 'ఇండియన్ 2' సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ కి ఎంపికైంది రకుల్. అలానే హిందీలో రెండు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రకుల్ టాలీవుడ్ నటుడు రానా ప్రేమలో మునిగితేలుతున్నట్లు ప్రచారం జోరందుకుంది.

అందంలో వెన్నెల.. అభినయంలో దేవసేన.. అనుష్క రేర్ ఫోటోలు!

చాలా కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ రకుల్ కానీ రానా కానీ ఈ విషయంపై స్పందించలేదు. తాజాగా ఓ భేటీలో పాల్గొన్న రకుల్.. రానాతో ఎఫైర్ కి సంబంధించి కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. రానాతో తను ప్రేమలో ఉన్నాననే విషయంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పింది.

తమ ఇద్దరి ఇళ్లులు చాలా దగ్గరగా ఉంటాయని.. తరచూ కలుస్తుండడంతో అటువంటి వార్తలు వచ్చి ఉంటాయని చెప్పింది. తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుండే హీరో రానా తనకు తెలుసునని చెప్పింది. అయితే రానాతో ఎప్పుడూ డేటింగ్ మాత్రం చేయలేదని చెప్పింది. పైగా అప్పటికే రానా ప్రేమలో ఉన్నాడని చెప్పింది.

తామిద్దరం స్నేహితులుగానే మెలిగినట్లు చెప్పింది. అంతేకాదు.. తాను నటించిన నటులందరితో స్నేహంగానే ఉంటానని రకుల్ వెల్లడించింది. అలానే రానాతో కూడా తనుకున్న బంధం స్నేహమే అని ప్రేమ కాదని చెప్పుకొచ్చింది. తను ఇప్పటివరకు ఎవరినీ ప్రేమించలేదని.. ఇంకా సింగిల్ గానే ఉన్నట్లు చెప్పింది.