రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. ప్రస్తుతం రకుల్ కు అవకాశాలు తగ్గడంతో ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ పై కన్నేసింది. బాలీవుడ్ లో అప్పుడప్పుడూ రకుల్ కు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. గతంలో రకుల్ అజయ్ దేవగన్ సరసన దే దే ప్యార్ దే అనే చిత్రంలో నటించింది. 

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో చివరగా నటించిన మన్మథుడు 2 చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ టాలీవుడ్ లో తన జర్నీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగులో రకుల్ దాదాపుగా స్టార్స్ అందరితో నటించింది. నేను నటించిన చిత్రాలు కొన్ని విజయం సాధించాయి.. మరికొన్ని నిరాశపరిచాయి. చాలా ఆఫర్స్ చేజారాయి కూడా. 

దిశ కేసు: హడావిడి చేసిన ఆర్జీవీ.. చెన్నకేశవులు భార్యకు చేసిన సాయం ఇదా!

నేను చేయాల్సిన చిత్రాలలో ఇతర హీరోయిన్లు నటించినా నిరాశపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో హీరోల రెమ్యునరేషన్ గురించి కూడా రకుల్ మాట్లాడింది. టాలీవుడ్, కోలీవుడ్ లాంటి దక్షణాది చిత్ర పరిశ్రమల్లో హీరోలకు, హీరోయిన్లకు సమానమైన పారితోషికం ఉండదు. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా కష్టపడతారు. కానీ హీరోయిన్లకంటే హీరోలకే అత్యధిక రెమ్యునరేషన్ ఉంటుంది. దానిని నేను పెద్ద తప్పుగా భావించను. 

శృతి మించిన ఎక్స్ ఫోజింగ్, డ్రెస్ పై ట్రోలింగ్.. నా ఇష్టం అంటున్న హీరోయిన్!

ఎందుకంటే దక్షిణాదిలో ప్రేక్షకుల ఎక్కువగా హీరోల కోసమే థియేటర్స్ కి వస్తారు. అలాంటప్పుడు హీరోల రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉండడంలో తప్పు లేదని రకుల్ చెప్పుకొచ్చింది. కొంతమంది హీరోయిన్లు బాలీవుడ్ కు వెళ్ళాక టాలీవుడ్ పై చిన్నచూపు చూస్తారు. కానీ రకుల్ మాత్రం ప్రతి విషయంలో టాలీవుడ్ కి సపోర్ట్ చేస్తోంది.