యావత్ దేశం మొత్తం కలకలం సృష్టించిన దిశ సంఘటన ఛాయలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆ నలుగురు మృగాల వల్ల దిశ ఫ్యామిలీ మాత్రమే కాదు.. నేరస్థుల కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. కన్న కుమార్తెని కోల్పోయి దిశ కుటుంబం తల్లడిల్లుతోంది. 

నలుగురు దోషుల కుటుంబాలు కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి. ముఖ్యంగా చెన్నకేశవులు ఫ్యామిలీ పరిస్థితి మరీ దారుణం. చెన్నకేశవులు భార్య రేణుక ప్రస్తుతం గర్భవతి. ఆ కుటుంబాలకు మీడియా తాకిడి ఇంకా కొనసాగుతోంది. ఇక సంచలన దర్శకుడు వర్మ దిశా సంఘటనపై చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

వర్మ ఈ ప్రకటన చేసిన తర్వాత అతడు చెన్నకేశవులు భార్యని కలిశాడు. ఆమెతో అనేక విషయాలు మాట్లాడాడు. వర్మ రేణుకకు ఆర్థిక సాయం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా రేణుక ఓ మీడియాతో మాట్లాడుతూ వర్మ చేసిన సాయం, అతడు దిశా కేసుపై తెరకెక్కించే చిత్రం గురించ్చి మాట్లాడింది. వర్మ చెన్నకేశవులు భార్యకు రూ.10వేలు ఆర్థికసాయం అందించాడట. ఇంత హడావిడి చేసి ఆమెకు వర్మ చేసిన సాయం ఇదా అని కామెంట్స్ చేసేవారూ లేకపోలేదు. 

సుగాలి ప్రీతి కేసు: పవన్ ఫ్యాన్స్ ఒత్తిడి.. హరీష్ శంకర్ రెస్పాన్స్ ఇదే!

ఇదిలా ఉండగా రేణుక మీడియాతో మాట్లాడుతూ వర్మ చిత్రం గురించి స్పందించింది. వర్మ దిశా చిత్రంలో నీ భర్తని విలన్ గా చూపించబోతున్నారు.. దీనిపై మీ స్పందన ఏంటి అని అడగగా.. నా భర్త చనిపోయాడు.. ఇక రాడు.. అలాంటప్పుడు సినిమాలో ఎలా చూపిస్తే నాకేంటి. ముందైతే రాంగోపాల్ వర్మ సినిమా తీయాని ఆ తర్వాత చూద్దాం అని రేణుక బదులిచ్చింది. 

వర్మ పిలుపు మేరకు అయన వద్దకు వెళ్ళాం అని రేణుక తెలిపింది. కారు ఛార్జీలు ఆయనే భరించారు. 10 వేలు సాయం చేశారు అని తెలిపింది. సినిమా గురించి తనకెలాంటి విషయాలు తెలియజేయలేదని రేణుక పేర్కొంది. దిశ హత్య, అత్యాచార ఘటనలో నలుగురు దోషులలో చెన్నకేశవులు ఒకడు. నలుగురు దోషులని హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. 

శృతి మించిన ఎక్స్ ఫోజింగ్, డ్రెస్ పై ట్రోలింగ్.. నా ఇష్టం అంటున్న హీరోయిన్!