రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ అందరి సరసన రకుల్ రొమాన్స్ చేసింది. ఇటీవల రకుల్ కి అంతగా కలసి రావడం లేదు. ఆమె నటించిన  నిరాశపరుస్తున్నాయి. 

వెండితెరపై అవసరమైన మేరకు గ్లామర్ ఒలకబోసేందుకు రకుల్ వెనుకాడదు. కానీ కెరీర్ ఆరంభంలో అందాల ఆరబోత అంటే రకుల్ కు ఇష్టం లేదట. ఈ విషయాన్ని రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మోడలింగ్ లోకి ఎంటర్ అయ్యాక మిస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొనాల్సి వచ్చింది.

ఆ సినిమా నా కెరీర్ కు పెద్ద దెబ్బ.. స్టార్ హీరో డిజాస్టర్ మూవీపై తమన్నా కామెంట్స్ 

కాంటెస్ట్ లో పాల్గొనడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే బికినీ వేసుకోవాలి. ఇదే విషయాన్ని అమ్మా నాన్నకు చెప్పా. కానీ వారిద్దరి నుంచి భిన్నమైన సమాధానం వచ్చింది. కాంటెస్ట్ లో ఎందుకు పాల్గొనడం లేదు అని అడిగారు. అక్కడ బికినీ వేసుకోవాలి. అందుకు నేను ప్రిపేర్ గా లేను అని చెప్పా. 

అందుకు నువ్వు కచ్చితంగా ప్రిపేర్ కావాలి అని అమ్మ చెప్పింది. నాన్న అయితే డల్ గా ఉండే కలర్స్ లో కాకుండా.. మంచి రంగుల్లో బికినీ కొనుక్కోమని చెప్పినట్లు రకుల్ ఇంటర్వ్యూలో పేర్కొంది. కెరీర్ పరంగా తనకు కుటుంబ సభ్యుల నుంచి అంత మంచి సపోర్ట్ లభించిందని రకుల్ తెలిపింది.