స్టార్ హీరోయిన్లంతా ఇప్పుడు వెబ్ సీరీస్ లో వైపు ప్రయాణం పెట్టుకున్నారు. సమంత, కాజల్, తమన్నా వంటి స్టార్స్ ఇప్పటికే వెబ్ సీరీస్ కు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేసి ట్రెండ్ లో ఉన్నామంటున్నారు. ఈ రూటులో త్వరలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరనుంది. మన్మధుడు 2 తర్వాత తెలుగులో రకుల్ కు ఆఫర్స్ రావటం లేదు. అయితే హిందీ సినిమాలు చేయటం ఆమెకు ప్లస్ అయ్యింది. తన పీఆర్ టీమ్ ని మార్చిన రకుల్ కు మంచి ఆఫర్ ..వెబ్ సీరిస్ రూపంలో వచ్చిందని సమాచారం.

ముంబై కు చెందిన పీఆర్ ఏజెన్సీ వాళ్లు ....రకుల్ కు అమెజాన్ ప్రైమ్ కు చెందిన ఓ భారీ బడ్జెట్ వెబ్ సీరిస్ లో ఆఫర్ తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. రకుల్ కు బాగానే ముట్టచెప్పే ఈ వెబ్ సీరిస్ లో బోల్డ్ సీన్స్ సైతం ఉంటాయంటున్నారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ వెబ్ సీరిస్ ...తెలుగు తో సహా దక్షిణాది భాషలన్నిటిలోనూ డబ్ కానుంది. దాంతో రకుల్ చాలా హ్యాపీగా ఉందట.  

‘RRR’ :షాకిచ్చే రేటుకి ప‌.గో జిల్లా డీల్ ఫైన‌ల్!

ఈ వెబ్ సీరీస్ గురించి నటి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నాకు కూడా వెబ్ సీరీస్ లో నటించమని చాలా ఆఫర్లు వస్తున్నాయి. నాకూ ఆసక్తిగానే వుంది.  కొత్త పాత్రలు వస్తే, మంచి ఆఫర్ అనిపిస్తే తప్పకుండా చేస్తాను' అని చెప్పింది.

ఈ వెబ్ సీరిస్ తో పాటు రకుల్...హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఆ మధ్యన అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడిచేసింది. దాంతో ఆమెకు మరికొన్ని బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి. అయితే వాటిల్లో బెస్ట్ ఏరుకుని చేస్తానంటోంది. అంతేకాదు...జనాల్లో ఎప్పుడూ నానటం కోసం...కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టే పోగ్రాం పెట్టుకుంటోంది.