Asianet News TeluguAsianet News Telugu

‘RRR’ :షాకిచ్చే రేటుకి ప‌.గో జిల్లా డీల్ ఫైన‌ల్!

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.... ఆర్.ఆర్.ఆర్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా రైట్స్ ని  గీతా & ష‌న్ముఖ ఫిలింస్ 13కోట్లు చెల్లించి ద‌క్కించుకుంది. 

RRR: West Godavari business closed
Author
Hyderabad, First Published Dec 27, 2019, 9:37 AM IST

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కోసం తెలుగు సినిమా పరిశ్రమ మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీలు సైతం  ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది కావటంతో ఈ స్దాయి క్రేజ్ ఉంది . టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కి సంబంధించిన ప్రతి చిన్న విషయం మీడియాలో సెన్సేషన్ అవుతోంది. అదే స్దాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం జరుగుతోందని, ఏరియాలు ఫైనల్ చేస్తున్నారని తెలుస్తోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.... ఆర్.ఆర్.ఆర్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా రైట్స్ ని  గీతా & ష‌న్ముఖ ఫిలింస్ 13కోట్లు చెల్లించి ద‌క్కించుకుంది. కేవ‌లం గోదావ‌రి జిల్లాల్లోనే కాదు ఇత‌ర ఏరియాల్లోనూ భారీ రేట్లు పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వస్తున్నారు.  ఓవ‌ర్సీస్, హిందీ మార్కెట్లోనూ ఆర్.ఆర్.ఆర్ కి డిమాండ్ భారీ స్థాయిలోనే ఉండ‌నుంది.

బికినిలో సీరియల్ (నాగిని) బ్యూటీ హాట్ అందాలు

ఈ చిత్రంలో కొమరం భీంగా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. డివివి దాన‌య్య దాదాపు 350కోట్ల బ‌డ్జెట్ తో చేస్తున్న ఈ చిత్రంలో  ఆలియా భ‌ట్, ఒలీవియో హీరోయిన్స్ గా ఆడిపాడుతున్నారు. స్వాతంత్య్ర కాలం నాటి ఫిక్ష‌న్ డ్రామాతో ఈ సినిమా తెర‌కెక్కుతున్న  ఈ సినిమాలో సుమారు ఏడు పాటలు ఉంటాయని తెలుస్తోంది. ఆవేశంతో కూడినవి, చైతన్యం రగిల్చేవి, ప్రేమ పాటలు కూడా ఉండొచ్చని వినికిడి. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన కొన్ని పాటలను ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ రాశారని సమాచారం.

మరో ప్రక్క  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనే పొడి అక్షరాల్ని ప్రతిబింబించే టైటిల్‌ పెట్టమంటూ ఇదివరకే రాజమౌళి అభిమానుల్ని కోరారు. ఆ నేపథ్యంలో సోషల్‌  మీడియాలో వందలాది టైటిళ్లు చక్కర్లు కొట్టాయి. అందులో ఓ పేరుని చిత్ర యూనిట్ ఖరారు చేసిందని సమాచారం. ఈ చిత్రానికి ‘రామ రౌద్ర రుషితం’ అనే పేరు బాగుంటుందని అనుకుంటున్నారట. మిగిలిన భాషల్లో  ‘రైజ్‌ రివోల్ట్‌ రివెంజ్‌’ పేరుతో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే  ఈ టైటిల్‌కి సంబంధించి చిత్రం టీమ్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios