టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే.. మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత ఆమెకి ఇతర భాషల నుండి కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కొన్ని సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ భామపై క్రిమినల్ కేసు నమోదైందనే విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విజయ్ ఆంటోనీకి జంటగా షాలిని పాండే 'అగ్ని సిరాగుగల్' అనే సినిమాలో నటించడానికి అంగీకరించింది.

బికినిలో కాజల్ అగర్వాల్.. పిచ్చెక్కించేలా అందాలు!

దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పై సైన్ కూడా చేసింది. మూడర్ కూడం నవీన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయాల్సివుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో కేవలం ఇరవై ఏడు రోజులు మాత్రమే పాల్గొన్న షాలిని ఆ తరువాత సెట్స్ కి రావడం మానేసిందట. మిగిలిన సన్నివేశాల్లో నటించనని తేల్చి చెప్పిందట.

దీంతో చిత్రనిర్మాత శివ.. షాలినిని ఒప్పించే ప్రయత్నం చేయగా.. దానికి ఆమె అంగీకరించలేదట. దీంతో చేసేదేంలేక రెమ్యునరేషన్ తీసుకొని సినిమాకి న్యాయం చేయలేదని తెలుగు, తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో షాలినిపై ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. పోలీస్ స్టేషన్ లో ఆమెపై క్రిమినల్ కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తుండడంతో ఆమె సౌత్ ని పట్టించుకోవడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమెకి రణవీర్ సింగ్ సరసన నటించే ఛాన్స్ రావడంతో ఇక కోలీవుడ్ సినిమాని పక్కన పెట్టేసిందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంపై షాలిని పాండే స్పందిస్తుందేమో చూడాలి!