Asianet News TeluguAsianet News Telugu

'దర్బార్: రజనీకి షాకిచ్చే రెమ్యునరేషన్!

అందుతున్న సమాచారం మేరకు దర్బార్ సినిమాకు గాను ఆయనకు 108కోట్లు రెమ్యునేషన్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇంతకు ముందు ఆయన చేసిన పేట సినిమాకు వంద కోట్లు దాకా ఇచ్చారని చెప్తున్నారు. 

Rajinikanth's Darbar Remuneration Revealed?
Author
Hyderabad, First Published Jan 10, 2020, 2:29 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. డబ్బై ఏళ్ల వయస్సులోనూ ఆయనకు అభిమానులు పెరుగుతున్నారే కానీ తగ్గటం లేదు.ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు ఆయనతో భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఆయన రెమ్యునేషన్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఆయన నటించిన దర్బార్ చిత్రం నిన్న (గురువారం) రిలీజైంది. తెలుగు,తమిళంలో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఆయనకు ఎంత రెమ్యునేషన్ ఇచ్చారనేది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు దర్బార్ సినిమాకు గాను ఆయనకు 108కోట్లు రెమ్యునేషన్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇంతకు ముందు ఆయన చేసిన పేట సినిమాకు వంద కోట్లు దాకా ఇచ్చారని చెప్తున్నారు. అయితే ఇంత రెమ్యునేషన్ పుచ్చుకునే హీరో సౌత్ లో లేరు. బాలీవుడ్ లోనూ ఈ స్దాయిలో రెమ్యునేషన్ తీసుకునేవాళ్లు లేరు. గత కొద్ది సంవత్సరాలుగా రజనీకాంత్...ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే హీరోగా ఉంటూ వస్తున్నారు.

అమలాపాల్ లేటెస్ట్ హాట్ ఫొటోలు.. అలా చూస్తూండిపోతారంతే!

అలాగే దర్బార్ చిత్రానికి గానూ దర్శకుడు మురగదాస్ కు 30 కోట్లు రెమ్యునేషన్ ఇచ్చినట్లు సమాచారం. నయనతార కు కూడా సాలిడ్ గానే ఇచ్చారని చెప్తున్నారు. అందుకు తగినట్లే మొదటి రోజు ఓపినింగ్స్ వచ్చాయని, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 34 కోట్లు దాకా వసూలు చేసిందని చెప్తున్నారు. ఈ వీకెండ్ లోనూ పొంగల్ కావటంతో తమిళనాట దుమ్ము దులుపుతుందని చెప్తున్నారు. తెలుగులో ఫస్ట్ రోజు మంచి టాక్ తో ఓపెన్ అయిన ఈ చిత్రం పోటీగా వస్తున్న స్ట్రెయిట్ సినిమాలను ఏ మేరకు తట్టుకుంటుదంనేది చూడాల్సిన విషయం.
 
 ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో... నయనతార హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో  బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు.  లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేసారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం విడుదల అయ్యింది. రజనీ కుమార్తెగా నివేదా థామస్.. ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios