డిస్కవరీ ఛానెల్ చూసే వారికి 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షో గురించి తెలిసే ఉంటుంది. ఈ షోని మొత్తం నడిపించే బేర్ గ్రిల్స్ కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. పర్యావరణ సంరక్షణ అనే కాన్సెప్ట్ తో ఈ షోని నడిపిస్తుంటాడు.

ఇటీవల ప్రధాని మోడీ కూడా బేర్ గ్రిల్స్ తో కలిసి ఈ షోలో పాల్గొన్నాడు. ఉత్తర ఉత్తరాఖండ్‌లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రమైన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో మోదీ, బేర్ గ్రిల్స్ తో కలిసి పర్యావరణ సంరక్షణ, వాతావరణంలో మార్పు వంటి అంశాల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ షో చేశారు.

షాకింగ్ లీక్ :ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం స్టోరీ లైన్, నేపధ్యం!

అలాంటి ఈ షోలో ఇప్పుడు సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కనిపించబోతున్నారు.  కర్నాటక టైగర్ ఫారెస్ట్ కి రజినీకాంత్ వెళ్లారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం కోసం వెళ్లిన రజినీ.. బేర్ గ్రిల్స్ తో కలిసి బండిపురా టైగర్ ఫారెస్ట్ కి వెళ్లారు.

రజినీకాంత్ రెండు రోజుల పాటు అడవిలోనే ఉండనున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు షో ఎప్పుడు ప్రసారమవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇటీవల రజినీకాంత్ నటించిన 'దర్బార్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది.