అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్ దర్బార్ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు  భారీగా నెలకొన్నాయి. ఇక తమిళనాడులో దర్బార్  లావా రేంజ్ లో హీటెక్కుతోంది.అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు సంబందించిన ప్రిమియర్ షోలు నేడు ఉదయమే భారీగా ప్రదర్శించారు.

సినిమాకు అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.   సినిమాలో రజినీకాంత్ అద్భుతంగా నటించాడు అనేకంటే తలైవా సరికొత్తగా కనిపించాడు అని చెప్పవచ్చు. రజినీను ఎలివేట్ చేసే సీన్స్ తో డీసెంట్ గా సాగాయి. రజిని మార్క్ డైలాగ్ "ఐమ్ ఏ బ్యాడ్ కాప్" అంటూ ఇంటర్వెల్ లో చెప్పిన డైలాగ్ ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించింది. దర్శకుడు మురగదాస్ తన ఇంటిలిజెంట్ స్క్రీన్ ప్లే ను ఏ మాత్రం మిస్ చేయకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ని బాగా ప్రజెంట్ చేశాడు.

అయితే అక్కడక్కడా బోరింగ్ అనిపించే సన్నివేశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ డాన్ గా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి అద్భుతమైన నటనను కనబరిచాడు. అతని స్టైల్ అండ్ విలనిజమ్ సినిమాలో మరో హైలెట్ పాయింట్. ఇక ముఖ్యంగా అనిరుద్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలో మరో మేజర్ ప్లస్ పాయింట్. తమిళ్ రజిని అభిమానులకు సినిమా అయితే బాగా నచ్చేసినట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ కోరుకునే యాక్షన్ సన్నివేశాలు గట్టిగానే ఉన్నాయి. మరీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

రజినీకాంత్ 'దర్బార్' ట్విట్టర్ రివ్యూ