రజినీకాంత్ - ఎఆర్.మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం దర్బార్. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక గురువారం తెల్లవారుజాము నుంచే తమిళనాడులో అభిమానుల కోసం స్పెషల్ షోలను ప్రదర్శించారు. సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ - ఎఆర్.మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం దర్బార్. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక గురువారం తెల్లవారుజాము నుంచే తమిళనాడులో అభిమానుల కోసం స్పెషల్ షోలను ప్రదర్శించారు. సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రతి ఫ్రేమ్ లో తలైవా అద్భుతంగా ఉన్నారని చాలా మంది అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సినిమాలో మెయిన్ హైలెట్ అని చెబుతున్నారు. ఇక రజినీకాంత్ గత సినిమలకంటే ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తున్నారని అభిమానులకు ఈ పొంగల్ కి ఫుల్ మీల్స్ దొరికినట్లేనని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ లొనే తలైవా తన నట విశ్వరూపాన్ని చూపించడాని, సెకంస్ హాఫ్ లో దర్శకుడు స్క్రీన్ ప్లే తో సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా మాలిచాడని అంటున్నారు.

రజినీకాంత్ పలు సన్నివేశాల్లో బ్యాడ్ పోలీస్ గా ఆడియెన్స్ చేత విజిల్స్ వేయిస్తున్నాడు. హీరోయిన్ కి ఫస్ట్ హాఫ్ లో పెద్దగా స్కోప్ లేదని అయితే మురగదాస్ తన స్టాండర్డ్ కి తగ్గట్టుగా హీరో క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని సీన్స్ ని క్రియేట్ చేసినట్లు చెబుతున్నారు. మెయిన్ గా అభిమానులకు నచ్చే విధంగా యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేసినట్లు టాక్ వస్తోంది. అలాగే అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఫైనల్ గా దర్బార్ సినిమాతో తలైవా మంచి సక్సెస్ అందుకోబోతున్నట్లు టాక్ వస్తోంది.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…