కేవలం మహేష్ అభిమానులే కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్న చిత్రం  ‘సరిలేరు నీకెవ్వరు’.  ‘మహర్షి’ హిట్‌ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావటం ఆయన మేజర్‌ అజయ్‌ కృష్ణగా కనిపించటం ఫ్యాన్స్ కు ఆసక్తి కలిగిస్తున్నాయి. అలాగే సుదీర్ఘ విరామం తర్వాత విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఆయన పాత్ర గురించి రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడారు.

చిరు 152.. ఇది నిజమైతే మెగా ఫ్యాన్స్ కు కలవరం తప్పదు!

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...ప్రస్తుతం ‘స‌రిలేరు నీకెవ్వరు’, ‘అల.. వైకుంఠ‌పురంలో..’, ‘ఎర్ర చీర’ త‌దిత‌ర చిత్రాల్లో న‌టిస్తున్నా. ‘స‌రిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నేను మ‌హేష్‌బాబు టామ్ అండ్ జెర్రీలా క‌నిపిస్తాం. చాలా ఫన్నీగా సాగే ఈ పాత్ర మంచి పేరు తీసుకువస్తుంది అన్నారు. అలాగే నేను చేస్తున్న మరో చిత్రం ‘అల.. వైకుంఠ‌పురంలో’ . అందులో నాది ఎస్పీ పాత్ర. అంటే ‘జులాయి’లోని పాత్రకి సీక్వెల్‌లా ఉంటుంది కానీ.. ఇది మ‌రో త‌ర‌హా పాత్ర’. అని రివీల్ చేసారు.  

రీసెంట్ గా  కేరళ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మహేశ్‌కు జంటగా రష్మిక కనిపించనున్నారు. విజయశాంతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాల్లో నటిస్తుండటంతో… ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. ఈ సినిమాలో విజయశాంతి రాయలసీమకు చెంది పవర్ ఫుల్ లేడీ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

సంక్రాంతి సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.   దిల్‌రాజు, రామబ్రహ్మం, మహేశ్‌బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ స్వరాలు సమకూరుస్తున్నారు. జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.