Asianet News TeluguAsianet News Telugu

చిరు, మోహన్ బాబు కాళ్లు మొక్కి.. స్టేజ్ దిగివెళ్లిపోయిన రాజశేఖర్

మా అసోసియేషన్ రచ్చ మరోసారి బయటపడింది. మెగాస్టార్ మాటలకు రాజశేఖర్ కౌంటర్ గా అభ్యంతరాలు తెలుపడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మంచి ఉంటె మైక్ లో చెప్పుకోవాలని.. చెడు ఉంటె చెవిలో చెప్పుకోవాలని మెగాస్టార్ చేసిన కామెంట్స్ కి రాజశేఖర్ కౌంటర్ ఇచ్చారు. 

rajasekhar shocking behaviour in maa meeting
Author
Hyderabad, First Published Jan 2, 2020, 1:36 PM IST

మా అసోసియేషన్ రచ్చ మరోసారి బయటపడింది. మెగాస్టార్ మాటలకు రాజశేఖర్ కౌంటర్ గా అభ్యంతరాలు తెలుపడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మంచి ఉంటె మైక్ లో చెప్పుకోవాలని.. చెడు ఉంటె చెవిలో చెప్పుకోవాలని మెగాస్టార్ చేసిన కామెంట్స్ కి రాజశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ఎంత దాచినా నిప్పు దాగదని పొగ వస్తుందని చెబుతూ మెగాస్టార్ చెబుతున్నా వినకుండా రాజశేఖర్ కోపంగా మాట్లాడారు.  

అందరూ రాజశేఖర్ వ్యాఖ్యలను కండించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే రాజశేఖర్ స్టేజ్ పైన ఉన్న కృష్ణం రాజు - చిరంజీవి - పరుచూరి - సుబ్బిరామిరెడ్డి వంటి వారి కళ్ళను మొక్కుతూ స్టేజ్ దిగి వెళ్లిపోయారు. ఆయన ప్రవర్తనపై సినీ పెద్దలు అభ్యంతరం తెలిపారు.

రాజశేఖర్ vs మెగాస్టార్ ఫైట్.. మోహన్ బాబు కౌంటర్

ముందుగా మా అసోసియేషన్ గురించి మాట్లాడిన చిరు.. ఈ అసోసియేషన్ లో ఫండ్ రైజ్ చేయడం కోసం అమెరికాలో ఈవెంట్స్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం అసోసియేషన్ లో 900 మంది ఉన్నారని.. వారికోసం మరిన్ని ఈవెంట్స్ చేయాలని అన్నారు. ఈ ఈవెంట్స్ కోసం రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా వారందరినీ ముందుకు తీసుకురావాలని అన్నారు.  హీరోలు కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు కదా వారొక పది కోట్లు చొప్పున ఇవ్వలేరా అని అనుకుంటారు..

కానీ అలా ఇవ్వడం కాదు.. డబ్బులు జెనరేట్ చేయడమనేది ముఖ్యమని చెప్పారు. ఈ అసోసియేషన్ కోసం ప్రభుత్వం కొంత స్థలం కేటాయిస్తామని కూడా చెప్పిందని.. కానీ అదే సమయంలో 'మా' ఫ్యామిలీలో కొన్ని ఇష్యూలు రావడం, ఎలక్షన్స్ వంటివి జరిగాయని అన్నారు.  కానీ ప్రభుత్వం మాట ఇచ్చిందని రెండు, మూడు ఎకరాలు స్థలం కేటాయించనుందని చెప్పారు. అందరం కలిసి పని చేయాలని చెప్పారు.

ఇండస్ట్రీకి పేరు తీసుకురావాలే కానీ ఎవరికి పేరు వెళ్తుందనేది ముఖ్యం కాదని... 'మా'కి పేరు తీసుకురావాలని చెప్పారు. 'మా'లో ఏమైనా ఇబ్బందులు ఉంటే మనలో మనం పరిష్కరించుకుందామని అన్నారు.  ''మా' గురించి మంచి ఉంటే మైక్ లో చెప్పుకుందాం.. చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం' అని అన్నారు. ఒకప్పుడు 'మా'లో ఇలాంటివి వివాదాలు ఉండేవి కావు.. కానీ ఇప్పుడు వివాదాలు వస్తూనే ఉన్నాయి. అందరం కలిసి ముందుకు వెళ్లే దిశగా ఆలోచించండని చెప్పారు. చిరు స్పీచ్ అయిన వెంటనే మైక్ తీసుకున్న రాజశేఖర్ స్టేజ్ పై ఉన్న అందరి పాదాలకు మొక్కాడు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఎంతో పని చేశానని.. ఆ టెన్షన్ లో నాకు కారు యాక్సిడెంట్ కూడా జరిగిందని చెప్పారు రాజశేఖర్. చిరంజీవి చెప్పిన మాటలను తప్పుబడుతూ రాజశేఖర్ మాట్లాడడం వివాదానికి దారి తీసింది. 'మా'లో ఉన్న 26 మందిలో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు ఉన్నారని చెప్పారు రాజశేఖర్. ఈ అసోసియేషన్ లో ఏది సవ్యంగా జరగడం లేదని అన్నారు. అనంతరం మైక్ తీసుకున్న చిరు.. తన మాటకి విలువ ఇవ్వలేదని ఎమోషనల్ అయ్యారు.  మాటకి విలువ ఇవ్వనప్పుడు ఇక్కడ మేం ఉండడం ఎందుకని ప్రశ్నించారు. రాజశేఖర్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని చిరు చెప్పారు. స్టేజ్ పై రాజశేఖర్ మర్యాద లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. ప్లాన్ చేసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారని.. డిసిప్లైనరీ సిస్టం ఏదైనా ఉంటే గనుక రాజశేఖర్ పై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios