మా అసోసియేషన్ లో విబేధాలు ఉన్నట్లు మరోసారి రుజువయ్యింది. టాలీవుడ్ పెద్దల మధ్య అభ్యంతరాలు తలెత్తడం హాట్ టాపిక్ గా మారింది. నేడు నిర్వహించిన 'మా' డైరీ ఆవిష్కరణ మీటింగ్ లో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మెగాస్టార్ మాట్లాడుతుండగా ఆయన పదే పదే మైక్ లాక్కొని వివాదాస్పదంగా మాట్లాడటం మీటింగ్ లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

అందుకు కౌంటర్ గా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడటం మరోసారి మా వివాదాన్ని తెరపైకి వచ్చేలా చేసింది. అయితే ఈ వివాదం పై మోహన్ బాబు మాట్లాడుతూ.. వివాదాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. మనందరం ఒక తల్లి బిడ్డలం అంటూ రాజశేఖర్ అంటే తనకు ఎంతో గౌరవమని అందరూ కలిసి కట్టుగా ఉండాలని అన్నారు.. అలాగే ఇంతటితో ఈ వివాదాన్ని మర్చిపోవాలని అన్నారు.

ఇక సుబ్బిరామి రెడ్డి గారు గత 40 ఏళ్ల నుంచి సినిమా పరిశ్రమకు ఎంతో చేశారని అన్నారు.  ఇక మెగాస్టార్ తో తనకు ఎంతో మంచి స్నేహం ఉందని కలిసినప్పుడల్లా ఎదో ఒకటి అంటుంటాని అంటారు. ఇంట్లో అన్నదమ్ములకు జరిగిన వివాదాలే తమ మధ్య కూడా జరుగుతాయని చెబుతూ.. మనందరం ఒక తల్లి బిడ్డలమని అన్నారు. అన్ని మర్చిపోయి ఏఎన్నార్ - ఎన్టీఆర్ లాగా కలిసి ఉండాలని చెప్పారు. ఎలక్షన్స్ ఎన్నో వస్తుంటాయని అహంకారానికి పోతే మంచిది కాదని చెప్పారు.

నాకు విలువలేదు, రాజశేఖర్ ప్లాన్ ఇది.. మండిపడ్డ చిరంజీవి!

ముందుగా మా అసోసియేషన్ గురించి మాట్లాడిన చిరు.. ఈ అసోసియేషన్ లో ఫండ్ రైజ్ చేయడం కోసం అమెరికాలో ఈవెంట్స్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం అసోసియేషన్ లో 900 మంది ఉన్నారని.. వారికోసం మరిన్ని ఈవెంట్స్ చేయాలని అన్నారు. ఈ ఈవెంట్స్ కోసం రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా వారందరినీ ముందుకు తీసుకురావాలని అన్నారు.

హీరోలు కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు కదా వారొక పది కోట్లు చొప్పున ఇవ్వలేరా అని అనుకుంటారు.. కానీ అలా ఇవ్వడం కాదు.. డబ్బులు జెనరేట్ చేయడమనేది ముఖ్యమని చెప్పారు. ఈ అసోసియేషన్ కోసం ప్రభుత్వం కొంత స్థలం కేటాయిస్తామని కూడా చెప్పిందని.. కానీ అదే సమయంలో 'మా' ఫ్యామిలీలో కొన్ని ఇష్యూలు రావడం, ఎలక్షన్స్ వంటివి జరిగాయని అన్నారు.

కానీ ప్రభుత్వం మాట ఇచ్చిందని రెండు, మూడు ఎకరాలు స్థలం కేటాయించనుందని చెప్పారు. అందరం కలిసి పని చేయాలని చెప్పారు. ఇండస్ట్రీకి పేరు తీసుకురావాలే కానీ ఎవరికి పేరు వెళ్తుందనేది ముఖ్యం కాదని... 'మా'కి పేరు తీసుకురావాలని చెప్పారు. 'మా'లో ఏమైనా ఇబ్బందులు ఉంటే మనలో మనం పరిష్కరించుకుందామని అన్నారు.

''మా' గురించి మంచి ఉంటే మైక్ లో చెప్పుకుందాం.. చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం' అని అన్నారు. ఒకప్పుడు 'మా'లో ఇలాంటివి వివాదాలు ఉండేవి కావు.. కానీ ఇప్పుడు వివాదాలు వస్తూనే ఉన్నాయి. అందరం కలిసి ముందుకు వెళ్లే దిశగా ఆలోచించండని చెప్పారు. చిరు స్పీచ్ అయిన వెంటనే మైక్ తీసుకున్న రాజశేఖర్ స్టేజ్ పై ఉన్న అందరి పాదాలకు మొక్కాడు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఎంతో పని చేశానని.. ఆ టెన్షన్ లో నాకు కారు యాక్సిడెంట్ కూడా జరిగిందని చెప్పారు రాజశేఖర్. చిరంజీవి చెప్పిన మాటలను తప్పుబడుతూ రాజశేఖర్ మాట్లాడడం వివాదానికి దారి తీసింది. 'మా'లో ఉన్న 26 మందిలో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు ఉన్నారని చెప్పారు రాజశేఖర్. ఈ అసోసియేషన్ లో ఏది సవ్యంగా జరగడం లేదని అన్నారు. అనంతరం మైక్ తీసుకున్న చిరు.. తన మాటకి విలువ ఇవ్వలేదని ఎమోషనల్ అయ్యారు.

మాటకి విలువ ఇవ్వనప్పుడు ఇక్కడ మేం ఉండడం ఎందుకని ప్రశ్నించారు. రాజశేఖర్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని చిరు చెప్పారు. స్టేజ్ పై రాజశేఖర్ మర్యాద లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. ప్లాన్ చేసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారని.. డిసిప్లైనరీ సిస్టం ఏదైనా ఉంటే గనుక రాజశేఖర్ పై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు.