గతంలో చిరంజీవి, రాజశేఖర్ మధ్య ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. రీసెంట్ గా కొన్ని వారాల క్రితం మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా రసాభాస జరిగింది. చిరంజీవితో విభేదిస్తూ వేదికపైనే రాజశేఖర్ వాదనకు దిగారు. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో చిరంజీవి అభిమానులు రాజశేఖర్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. 

రాజశేఖర్ వెండితెరపైనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా యాంగ్రీ మ్యానే. దీనితో రాజశేఖర్ నోటి వెంట ఎలాంటి మాటలు వినిపించినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక అసలు విషయానికి వస్తే రాజశేఖర్ నటించిన అర్జున చిత్రం గత ఏడాదే విడుదల కావలసింది. కానీ వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కేజీఎఫ్ హీరో హత్యకు కుట్ర.. రౌడీ షీటర్ ఎన్​కౌంటర్, కడుపులో బుల్లెట్స్ దించిన పోలీసులు

ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో రాజశేఖర్ ఎప్పటిలాగే పవర్ ఫుల్ డైలాగ్స్ చెబుతున్నారు. ఓ డైలాగ్ గురించి మాత్రం అభిమానుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 'పార్టీ ఓపెన్ చేయగానే టికెట్స్ అమ్ముకుని, ఏపీని అయిపోయాక పార్టీనే అమ్ముకోవడానికి కాదురా పెట్టింది ఈ పార్టీ' అంటూ రాజశేఖర్ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. 

ఈ డైలాగ్ చిరంజీవిపై సెటైర్ వేసే విధంగా ఉందంటూ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. దీనితో ఈ వివాదాస్పద డైలాగ్ పై మెగా అభిమానులు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాల నుంచి నిష్క్రమించి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ అర్జున చిత్ర ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి. 

"