ఆలోచన కన్నా, అనుభవం చాలా గొప్పదంటారు. ఎన్నో సంవత్సరాల నట జీవితంలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారు సినిమా ఫలితాలను ఇట్టే ఊహించగలరు. అయితే తమ సినిమాలు విషయలంలోనూ ఫ్లాఫ్ అవుతుందని తెలిసినా వెనకడుగు వేయలేరు. జరుగుతున్న షూటింగ్ ని ఆపేయలేరు. కానీ వాళ్లు మాత్రం తమకు అనిపించింది చెప్పటం మానరు.

అలాంటి ఓ మాటనే రజనీకాంత్ ప్రముఖ నిర్మాత ఆశ్వనీదత్ తో అనటం జరిగింది. నువ్వు చేసే కథ కరెక్ట్ కాదు..ఆపేయ్ అని చెప్పారట. అయినా అశ్వనీదత్ ముందుకు వెళ్లిపోయి భారీ డిజాస్టర్ చవి చూసారు. ఆ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వూలో అశ్వనీదత్ గుర్తు చేసుకున్నారు.

ప్రియుడితో పెళ్లికి సిద్దమైన తెలుగు హీరోయిన్.. డేట్ ఫిక్స్

ఇంతకీ ఏమిటా సినిమా అంటే...యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో అశ్వీనీద‌త్ నిర్మించిన చిత్రం శ‌క్తి . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫ‌లితం చవి చూసిన సంగతి తెలిసిందే. భారీ బ‌డ్జెట్ తో యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమా   తార‌క్- ద‌త్ కెరీర్ లో  దారుణ‌మైన ప‌రాజ‌యంగా నిలిచింది. దాంతో  అశ్వీనీద‌త్ నిర్మాత‌గా కోలుకోవ‌డానికి కొన్ని సంవ‌త్స‌రాలు ప‌ట్టింది.

దాదాపు ఏడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మ‌హ‌న‌టి సినిమాతో ద‌త్ నిర్మాత‌గా రీ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టారు.   అయితే ఈ డిజాస్టర్  గురించి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ .. ద‌త్ గారిని ముందే హెచ్చ‌రించారట‌. ఈ విష‌యాన్ని దత్ ఓ ఇంట‌ర్వూ లో వెల్ల‌డించించి షాక్ ఇచ్చారు.

అశ్వనీదత్ మాట్లాడుతూ... మెహ‌ర్ ర‌మేష్ చెప్పిన‌ శ‌క్తి క‌థ విప‌రీతంగా న‌చ్చి తార‌క్ తో సినిమా చేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నా. ఆ సినిమాకి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఆ స‌మ‌యంలోనే  అనుకోకుండా ర‌జ‌నీకాంత్ గారు క‌లిసారు. అప్పుడే తార‌క్ తో శ‌క్తి సినిమా చేస్తున్నానని ఆయ‌న‌కు వెల్ల‌డించాను. ఆయ‌న వెంట‌నే వ‌ద్దు అన్నారు. శ‌క్తి పీఠాలపై సినిమాలు చేయ‌డం మంచిది కాదు…తీయ‌వ‌ద్దు అని గ‌ట్టిగానే చెప్పారు. కానీ అప్పుడు ఆయ‌న మాట వినిపించుకోలేదు. మొండిగా ముందుకెళ్లిపోయాను. ఆ త‌ర్వాత  శ‌క్తి ఫ‌లితం గురించి మీ అంద‌రికీ తెలిసిందే“న‌ని బాధతో అన్నారు.