దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తున్న ఈ చిత్రం దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఖాళీగానే ఉంటున్న రాజమౌలి వివిధ మీడియా సంస్థలతో ముచ్చటిస్తున్నారు. ఈ సంధర్భంగా రాజమౌళి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

కరోనా ప్రభావం ఆర్ఆర్ఆర్ బడ్జెట్ పై ఎంతవరకు ఉంటుందని ప్రశ్నించగా.. ఆర్ఆర్ఆర్ పై మాత్రమే కాదు.. అన్ని చిత్రాల బడ్జెట్ పై కరోనా ప్రభావం ఉంటుంది. కరోనా వచ్చింది కదా అని నాసిరకం క్వాలిటీతో సినిమాని ప్రేక్షకులకు వదిలేస్తే కుదరదు. ఈ టైంలో మా ముందు రెండు ఛాలెంజ్ లు ఉన్నాయి. 

మల్లెపూలు బాగా నలిపిందా, అందుకే ఆమెని తెచ్చుకున్నారు.. మాధవి లత సంచలనం

ప్రేక్షుకులు మెచ్చేలా మంచి క్వాలిటీతో సినిమా రూపొందించడం, అదే సమయంలో బడ్జెట్ విషయంలో కూడా పరిమితులు పెట్టుకోవడం అని రాజమౌళి అన్నారు. కరోనా ప్రభావం తగ్గాక కూడా కొంత కాలం పాటు ప్రజలు అంతా లగ్జరీలకు దూరంగా ఉండాల్సి వస్తుంది అని రాజమౌళి అన్నారు. 

ఇక వ్యక్తిగతంగా విషయంలో తన  కుటుంబం తీసుకుంటున్న జాగ్రత్తలని రాజమౌళి సరదాగా తెలిపారు. నా భార్య వల్ల మా ఇల్లు ఐసీయూ కంటే క్లీన్ గా ఉంటుంది అని అన్నారు.