రాజమౌళి సినిమాలు తీయటంలోనే కాదు...తీసిన సినిమాను మార్కెటింగ్ చేసుకోవటంలోనూ మాస్టరే. సినిమా ప్రారంభమైన నాటి నుంచే ప్రమోషన్ ప్లాన్స్ వేస్తూంటారు. అందుకోసం ప్రత్యేకమైన స్ట్రాటజీలతో ముందుకు వెల్తూంటారు. దాంతో సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ప్రమోషన్ తో వేడిక్కిపోయి ఉంటుంది.

ఒక్కసారిగా మార్కెట్ లో సినిమా హాట్ టాపిక్ అవుతుంది. బాహుబలి సినిమా హిందీ వెర్షన్ నిమిత్తం ...హిందీ పీఆర్ ఏజెన్స్ ల సాయిం తీసుకుని సక్సెస్ సాధించిన ఆయన ఇప్పుడు హాలీవుడ్ పీఆర్ ఏజెన్స్ లతో తమ తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మెంటల్ గా టార్చర్ చేశాడు.. ఇలియానా కామెంట్స్!

ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ వెర్షన్ సైతం డబ్ చేసి ఆర్ ఆర్ ఆర్ ని విడుదల చేసే ఆలోచనలో రాజమౌళి ఉండటమే అందుకు కారణం అంటున్నారు. అమెరికా, యూరప్ కంట్రీలలో ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం హాలీవుడ్ లో క్రేజ్ పుట్టించటం కోసం హాలీవుడ్ పీఆర్ ఏజెన్సీలతో ప్రమోషన్ చేయనున్నట్లు వినికిడి. వాళ్లు ఈ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లేందుకు సాయిం చేస్తారు. అప్పుడు బాలీవుడ్ లో మాత్రమే కాక ...హాలీవుడ్ లోనూ ఈ సినిమా గురించి మాట్లాడతారు. ఖచ్చితంగా అక్కడవారితో బిజనెస్ చేసే అవకాసం ఉంటుంది. రాజమౌళి ఈ సారి తన సినిమాతో నెక్ట్స్ లెవిల్ చూడాలనుకుంటున్నారు.

చిత్ర విశేషాలకు వస్తే..రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ ప్రధాన పాత్రధారులుగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సీన్స్  ను షూట్ చేసారు. ఈ సినిమాలో చరణ్ జోడీగా అలియా భట్ నటిస్తోంది.

ఎన్టీఆర్ జోడీగా హాలీవుడ్ నుంచి ఒక అమ్మాయిని తీసుకుంటే, కొన్ని కారణాల వలన ఆమె తప్పుకుంది. ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోనున్నారనేది అప్పటి నుంచి ఆసక్తిని రేకెత్తిస్తూనే వుంది. ఈ విషయంపై ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టడం కోసం రాజమౌళి రంగంలోకి దిగారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ 'ఒలివియా మోరిస్' నటించనుందని ప్రకటించారు.  

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.