అప్పటివరకు ఇద్దరూ మంచి స్నేహితులు.. కానీ ఎప్పుడైతే 'బిగ్ బాస్' సీజన్ 3 పాల్గొన్నారో.. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. హౌస్ లో వివాదాలతో వార్తల్లోకెక్కారు యాంకర్ శ్రీముఖి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్. షో ముగిసే వరకు ఇద్దరూ హౌస్ లో కొనసాగారు.

చివరకి రాహుల్ విజేతగా నిలవగా, శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. రాహుల్ గెలవడానికి కారణం శ్రీముఖి అని.. ఆమె రాహుల్ ని టార్గెట్ చేస్తూ నామినేట్ చేయడం వలన జనాల్లో అతడికి సింపతీ పెరిగి, అతడు ఎక్కువ ఓట్లు సంపాదించి షో విజేతగా నిలిచాడనే మాటలు వినిపించాయి.

ఎలాంటి సెక్స్ ని ఎంజాయ్ చేస్తారు..? తాప్సీ హాట్ ఆన్సర్!

హౌస్ లో ఉన్నంత కాలంవీరిద్దరూ రెండు గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. బయటకి వచ్చిన తరువాత కూడా ఆ గొడవలు కంటిన్యూ చేశారు. ఓ షో కోసం రాహుల్ ఆ మధ్య శ్రీముఖికి ఫోన్ చేస్తే మాట్లాడలేదని మీడియా ముఖంగా రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే. శ్రీముఖి కూడా బిగ్ బాస్ తరువాత ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రాహుల్ మీద అసహనాన్ని చాటింది.

అయితే ఇప్పుడు సడెన్ గా వీరిద్దరూ మళ్లీ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని ప్రకటించారు. దానికి సూచనగా ఓ సెల్ఫీని పోస్ట్ చేశారు. దానికి 'గతం గతః.. అసలు రిలేషన్ షిప్ ఇప్పుడు మొదలైంది' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

అంతేకాదు. వరుణ్ సందేశ్, వితికా, రాహుల్, శ్రీముఖి కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో రాహుల్, శ్రీముఖి కలిసి జిగేలు రాణి పాటకి స్టెప్పులు వేశారు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరి మధ్య జరిగిన గొడవలు సద్దుమణిగి.. పూర్వ స్థితికి వచ్చారని అభిమానులు సంతోషిస్తున్నారు.  

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Repost @sipligunjrahul @get_repost . . . Gatham Gathaha! Asalu relationship ipudu modalaindi! @sreemukhi ❤️

A post shared by Sreemukhi (@sreemukhi) on Dec 6, 2019 at 2:55pm PST