సౌత్ తోపాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మ తాప్సి. వరసప్రాజెక్టులతో బిజిగా ఉన్న ఆమె సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో సమాధానాలు ఇస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అలాగే తన ముక్కు సూటి సమాధానాలతో ఇచ్చే ఇంటర్వూలు సైతం ఆమె అభిమానులును ఆకర్షిస్తూంటాయి.

ముఖ్యంగా కొన్ని విషయాలపై ఆమె ఇచ్చే స్పష్టత, బోల్డ్ గా సమాధానమివ్వటం నచ్చుతూంటుంది. తాజాగా ఆమె  ఇండియా టుడే కాంక్లేవ్ నిర్వహించిన ఒక చర్చ కార్యక్రమంలో తాప్సి తనకు ఎదురైన కొన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలను ఇచ్చి అంతటా హాట్ టాపిక్ గా మారింది.

టోటల్ సినిమానే ఏకిపారేసిన ట్రోలర్స్.. తలలు పట్టుకున్న హీరోలు!

ఆమెను ...మీరు ఎలాంటి శృంగారం ని ఎంజాయ్ చేస్తారు....శృంగారం సరిగా చేయకపోయినా బాగా ప్రేమించే వ్యక్తిని ఇష్టపడతారా.. లేదంటే మిమ్ములను ఇష్టపడకపోయినా శృంగారం బాగా చేస్తే మీరు ఇష్టపడతారా అంటూ ప్రశ్నించారు. దానికి  తాప్సి  సమాధానమిస్తూ...సెక్స్.. ప్రేమ ఎప్పుడు వేరు వేరుగా ఉండవని,వాటిని వేరు వేరుగా చూడలేమని చెప్పుకొచ్చి ఆశ్చర్యపరిచింది.

కెరీర్ విషయానికి వస్తే...‘సాండ్‌ కీ ఆంఖ్‌’ సినిమా కోసం షూటర్‌గా మారిన ప్రముఖ నటి తాప్సి.. ఇప్పుడు చేతికి గ్లౌజులు తొడుక్కుని క్రికెట్‌ బ్యాట్‌ పట్టబోతున్నారు. భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ జీవితం ఆధారంగా ‘శభాష్‌ మిత్తు’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తాప్పి మిథాలీగా నటించనున్నారు.  ఈ  సినిమా కోసం తాప్పి కవర్‌ డ్రైవ్‌ నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వయాకామ్‌18 స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్‌ ఢోలాకియా దర్శకత్వం వహిస్తున్నారు.