బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన ఫ్యాన్స్ అందరి కోసం ఈ నెల 29న మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ షోకి సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో అతడికి 'ఈ కాన్సర్ట్ కి శ్రీముఖిని పిలిచారా..?' అనే ప్రశ్న ఎదురైంది.

దీనికి బదులిస్తే కాంట్రవర్సీ అవుతుంది కానీ నేను ఆన్సర్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ల విషయంలో శ్రీముఖికి తనకి మధ్య విభేదాలు వచ్చాయి కానీ ఆ తరువాత అన్ని విషయాలు పక్కన పెట్టేసి ఆమెతో కలిసిపోయే ప్రయత్నం చేశాను కానీ అది మాత్రం జరగడం లేదన్నట్లుగా చెప్పుకొచ్చాడు. 

మాకు సిగ్గు ఉండదు.. లవ్ ఎఫైర్స్ పై హీరోయిన్ హాట్ కామెంట్స్!

రెండు రోజుల క్రితం శ్రీముఖి కొత్త నంబర్ కి కాల్ చేస్తే తన ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేసి నా పేరు చెప్పగానే కట్ చేసిందని రాహుల్ చెప్పాడు. దీంతో మరోసారి ఫోన్ చేసి తన పేరు రాహుల్ సిప్లిగంజ్ అని చెప్పి కాన్సర్ట్ కి పిలవడానికి శ్రీముఖికి కాల్ చేశానని చెబితే ఆమె శ్రీముఖి ఫోటోషూట్ ఓ ఉందని చెప్పి ఫోన్ పెట్టేసిందని తెలిపాడు రాహుల్.

తనకున్న బిజీ షెడ్యూల్స్ వలన శ్రీముఖి తిరిగి కాల్ చేయడం మర్చిపోయి ఉండొచ్చని రాహుల్ అన్నాడు. ఈ కామెంట్స్ కాస్త వివాదాస్పదంగా మారాయి. రాహుల్ కలిసిపోదామని ప్రయత్నిస్తున్నా.. శ్రీముఖి యాటిట్యూడ్ చూపిస్తుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాహుల్ నిర్వహించే ఈ లైఫ్ కాన్సర్ట్ కి వరుణ్ సందేశ్, వితికా, పునర్నవిలు హాజరు కానున్నారు. 

మిగిలిన హౌస్ మేట్స్ ని కూడా పిలిచినట్లు చెప్పాడు రాహుల్. కానీ వాళ్లు వస్తారా..? రారా..? అనేది వాళ్ల ఇష్టమని చెప్పాడు. ఈ ఈవెంట్ లో పునర్నవితో కలిసి ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు రాహుల్.