సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు చాలా కామన్. ఇష్టం ఉంటే డేటింగ్ చేస్తారు లేదంటే విడిపోతారు. అలాంటి ఎఫైర్స్ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దీపికా సరదాగానే ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తనకు చాలా ప్రేమ వ్యవహారాలు ఉండటాన్ని దీపికా ప్రస్తావించింది. తామంతా 'విత్ ఔట్ ది షేమ్' అని ఆమె వ్యాఖ్యానించింది. ఆ సమయంలో ఆమె భర్త రణవీర్ సింగ్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. ఆ కార్యక్రమంలో దీపిక, రణవీర్, విజయ్ దేవరకొండ, అలియా భట్, ఆయుష్మాన్ ఖురానా, మనోజ్ భాజ్ పాయ్ తదితరులు ఉన్నారు.

గడ్డం పెంచు.. హిట్టు కొట్టు.. హీరోల నయా ఫార్ములా!

ఒక అంశం మీద దీపిక మాట్లాడుతూ.. తామంతా సిగ్గు లేకుండా పలు ప్రేమాయణాలను నడిపించినట్లుగా కామెంట్స్ చేసింది. ఆ విషయంలో తనను ఉదాహరణగా చెప్పుకుంది. తను రణబీర్ ని ప్రేమించానని.. ఆ తరువాత రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకున్నానని.. ఇప్పుడు రణబీర్ కపూర్, అలియాలు పెళ్లి చేసుకుంటున్నారని.. దీపికా వ్యాఖ్యానించింది.

అలా తన పాత ప్రియుడి గురించి తన భర్త పక్కన ఉండగానే దీపికా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. అక్కడే ఉన్న అలియా భట్.. దీపికా మాటలను ఖండించింది. దీపికా.. 'రణబీర్, అలియాలు పెళ్లి చేసుకుంటున్నారనే' మాటలను ఉద్దేశిస్తూ అలియా.. 'అది నువ్వెలా డిక్లేర్ చేస్తావ్' అంటూ ప్రశ్నించింది.

దీంతో దీపికా ఏదో కవర్ చేసే ప్రయత్నం చేసింది. అలియా.. తను రణబీర్ ని పెళ్లి చేసుకునే విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. మొత్తానికి ఇలా హీరోయిన్లు తమ ప్రేమ వ్యవహారాల గురించి ఓపెన్ గా కామెంట్స్ చేసుకునే రోజులు వచ్చేశాయి!