స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన సూపర్ చిత్రం ద్వారా అనుష్క టాలీవుడ్ కు పరిచయమైంది. అనుష్క టాలీవుడ్ లోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు పూర్తవుతోంది. దీనితో నిశ్శబ్దం చిత్ర యూనిట్ అనుష్క 15ఏళ్ళని సెలెబ్రేట్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూరి జగన్నాధ్, రాఘవేంద్ర రావు, రాజమౌళి లాంటి ప్రముఖులంతా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో పూరి, రాఘవేంద్ర రావు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పూరి జగన్నాధ్.. రాఘవేంద్ర రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ సంఘటనని వివరించారు. నా తొలి చిత్ర లాంచింగ్ కు రాఘవేంద్రరావు వచ్చారు. తొలిసారి అప్పుడే ఆయన్ని కలుసుకున్నా. ఆ తర్వాత మళ్లీ ఆయన్ని సూపర్ టైంలో అన్నపూర్ణ స్టూడియోలో కసుకున్నట్లు పూరి తెలిపాడు. 

రూ.120 కోట్లతో సినిమా.. ఎన్టీఆర్ పారితోషికం ఎంతో తెలుసా?

ఆయన్ని చూడగానే ఏం సర్ ఇక్కడ ఉన్నారు అని అడిగా.. నాగార్జున డేట్స్ కోసం వవచ్చా అని అన్నారు. దీనితో సర్ నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు మీ అడవిరాముడు సినిమా చూశా. నేను ఇపుడు డైరెక్టర్ అయి సినిమాలు చేస్తున్నా. ఇంకా మీరెందుకు సర్ చేయడం.. రిటైర్ కండి అని అడిగా. అప్పుడు ఆయన నవ్వు ఊరుకున్నారు. 

కానీ నేను తీసిన సూపర్ సినిమా తుస్సుమంది.. అదే టైంలో ఆయన చేసిన శ్రీరామదాసు(పూరి పొరపాటుగా అన్నమయ్య అన్నారు.. సూపర్ టైంలో రాఘవేంద్ర రావు తీసిన చిత్రం శ్రీరామదాసు) చిత్రం బ్లాక్ బస్టర్ అయింది అని పూరి వేదికపై తెలిపారు. అప్పుడు నేను వాగిన చెత్త వాగుడుకు ఇప్పుడు రాఘవేంద్ర రావు గారికి క్షమాపణలు చెబుతున్నా అని అన్నాడు. రాఘవేంద్ర రావు పాదాలకు పూరి నమస్కరించాడు. 

రాశి ఖన్నా, స్టార్ హీరోకి అలా జరగడం ఖాయం.. జ్యోతిష్యుడి వివాదాస్పద వ్యాఖ్యలు

ఇక రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. అనుష్కపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రయత్నిస్తే సినిమాలు వస్తాయి. కానీ అనుష్క లాగా మంచి పాత్రల్లో నటించాలంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం అనుష్కకు దక్కింది. అనుష్కని తొలిసారి అన్నపూర్ణ స్టుడియోలో చూసినప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్ అవుతుందని చెప్పా.. ఈ రోజు ఆ మాట నిజమైంది అని రాఘవేంద్ర రావు అన్నారు.