యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోతున్న రెండో చిత్రంపై ఇప్పటి నుంచే అనేక ఉహాగానాలు మొదలైపోయాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల క్రేజ్ మామూలుగా లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. 

త్రివిక్రమ్, ఎన్టీఆర్ ల చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ఇటీవలే త్రివిక్రమ్ అల వైకుంఠపురములో చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అల వైకుంఠపురములో మూవీ అలవోకగా 160 కోట్లకు పైగా షేర్ రాబట్టేసింది. దీనితో త్రివిక్రమ్, ఎన్టీఆర్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని 120 కోట్ల బడ్జెట్ కేటాయించేందుకు నిర్మాతలు రెడీ అయిపోయారట. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని సంస్థ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. 

నిండు గర్భంతో హీరోయిన్.. బికినీలో ఇన్ని సాహసాలా

ఇక ఈ చిత్రం కోసం ఎన్టీఆర్, త్రివిక్రమ్ పారితోషికం కూడా షాకిచ్చే విధంగా ఉంది. ఎన్టీఆర్ ఈ చిత్రానికి గాను 40 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు టాక్. ఇక తన సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా ఓకే నిర్మాత కాబట్టి లాభాల్లో వాటా ఉంటుందని అంటున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ 20 కోట్ల వరకు ఈ చిత్రానికి పారితోషికం అందుకోనున్నారట. బడ్జెట్ లో 50 శాతం వీరి రెమ్యునరేషన్స్ కే సరిపోతోంది. 

రాశి ఖన్నా, స్టార్ హీరోకి అలా జరగడం ఖాయం.. జ్యోతిష్యుడి వివాదాస్పద వ్యాఖ్యలు

'అయినను పోయి రావాలె హస్తినకు' అనే టైటిల్ ఈ చిత్రానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోవు రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలియనున్నాయి.