అతనో సీనియర్ నటుడు. ముప్పై ఏళ్లకు పైగా సినీ రంగాన్ని ఏలాడు. ఇప్పటికీ అప్పుడప్పుడూ తెరపై కనిపిస్తున్నాడు. ఆయన జీవితంలో పలు శృంగార అధ్యాయాలు ఉన్నాయని తన సర్కిల్స్ లో జరిగే పార్టీలలో ఘనంగా చెప్పుకుంటూంటారు.

అందుకు తగినట్లే అవకాసం వచ్చినప్పుడల్లా తన వయస్సు మరిచి వింత చేష్టలు చేస్తూంటాడు. నాలుగైదు సార్లు దాదాపు దొరికిపోయినంత పనైపోయి..చివర్లో ఎస్కేప్ అయ్యాడు. తెలిసిన ఆడవాళ్లకు ఆయనంటే హడల్. చిరాకు. అయితే ఆయన టాలెంట్, పరిచయాల ముందు ఇదేమీ పెద్ద విషయం కాకపోవటంతో ఎప్పుడూ రోడ్డున పడే పరిస్దితి రాలేదు.

రీసెంట్ గా కూడా ఆయన దృష్టిలో ఓ చిలిపి శృంగార చేష్ట ఒకటి ప్రదర్శించి, తాను శ్రీకృష్ణుడు అంతటివాడనని అనిపించోకోబోయాడు. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ బ్లౌజ్.. కేసు నమోదు!
 
వివరాల్లోకి వెళితే..ఓ బ్యూటీఫుల్ రేడియో జాకీ...తన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈవెంట్ కు సంబంధించిన ఇన్విటేషన్ ఇచ్చి ఆయన్ని ఇన్వైట్ చేయటానికి ఇంటికి వెళ్లింది. ఆమెతో పాటు ఆ ఈవెంట్ కు సంబంధించిన కొంతమంది కల్చరల్ పోగ్రామ్ ప్రతినిధులు ఉన్నారు. ఆమె అందానికి అడ్డంగా పడిపోయిన మన నటుడు ఎలాగైనా ఆమెతో గడపాలని ఫిక్సైపోయాడు. వెంటనే ఓ ప్లాన్ చేసుకుని, అమలు చేసాడు.

బయిట బయోపిక్ ల హవా నడుస్తోంది కాబట్టి..తనకు తన బయోపిక్ తెరపై చూసుకోవాలని ఉందని అన్నాడు.  అయితే ముందుగా పుస్తక రూపంలో వస్తే చూసి , తరించి ఆ తర్వాత ఉత్సాహవంతులతో సినిమాగా చేద్దామని ఆలోచన ఉందని చెప్పాడు. అందుకు నేనేం చేయాలి అని ఆమె అడిగితే..నీ టాలెంట్..నీ మాటల ద్వారా తెలిసింది. నీలాంటి టాలెంట్ ఉన్న వాళ్లు రాస్తే నా బయోపిక్ పదికాలాల పాటు నిలబడుతుంది అని ఉబ్బేసాడు. మొత్తం క్రెడిట్ నీకే ఇస్తా అన్నాడు.

అందుకు తన ఇంటర్వూలాంటి తన జీవిత విశేషాలు తెలుసుకుని రాయమని అన్నాడు. అయితే ఆ ఇంటర్వూ ఇంటి దగ్గర ఇస్తే..నలుగురు వచ్చి డిస్ట్రబ్ చేస్తారు కాబట్టి ఫలానా రిసార్ట్ కు వస్తే అక్కడ ఓ నాలుగు రోజులు గడిపి,రిలాక్స్ అయినట్లు ఉంటుంది...పూర్తిగా, డిటైల్డ్ గా తన జీవిత రహస్యాలు చెప్పినట్లు ఉంటుందని నమ్మబలికాడు.

అయితే ఆయనకు తెలీని విషయం ఏంటంటే..ఆమె ఇలాంటి వాళ్లను ఇట్టే పసిగట్టేస్తుంది. ఆయన కళ్లలో ఆకలిని గమనించేసింది. అయితే గొడవ పడే మనిషి కాదు...తెలివిగా...నేను బిజిగా ఉన్నాను సార్ అని అక్కడనుంచి ఎస్కేప్ అయ్యి....ఆయన నెంబర్ ని బ్లాక్ చేసి, నలుగుర్లో తన ఈ మాటర్ చెప్పి బాధపడుతూ..తెలివిగా ఆయన్ని రోడ్డుపై పెట్టే పోగ్రామ్ పెట్టేసుకుంది. ఈ కాలం పిల్లలతో పెట్టుకోకు బాసూ...బాల్చీ బలవంతంగా తన్నించేస్తారు.