బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ తను వేసుకున్న దుస్తుల కారణంగా వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఆమె వేసుకున్న బ్లౌజ్ తమ మత సంప్రదాయాలను, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ముంబైలో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు ఎమ్‌ఎన్‌ జోసీ మార్గ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ మధ్య వాణీ కపూర్ తను వేసుకున్న బ్లౌజ్ కారణంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. లైట్ పింక్ కలర్ బ్లౌజ్ వేసుకొని తన ఎద అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్ లో పాల్గొంది వాణీ కపూర్. బ్లౌజ్ వేసుకొని ఫోటోషూట్ లో పాల్గొంటే సమస్య ఏంటి అనుకుంటున్నారా..? అక్కడే ఉంది ట్విస్ట్.. ఆమె వేసుకున్న బ్లౌజ్ పై కొన్ని అక్షరాలు రాసి ఉన్నాయి.

స్టార్ హీరో సెక్స్ చేయమని అడిగాడు.. రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్!

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీరాముడి పేరు రాసుంది. బ్లౌజ్ మొత్తం దేవుడి పేరుతోనే ప్రింట్ అయి ఉంది. దాంతో వాణీకపూర్ హిందువుల సంప్రదాయాన్ని నాశనం చేస్తుందని.. వారి మనోభావాలు దెబ్బతీసిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో వాణీకపూర్ పోస్ట్ పెట్టిన కాసేపటికే తన పేజ్ నుండి ఆ ఫోటోలను తొలగించింది. తెలుగులో 'ఆహా కళ్యాణం' సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో 'సంషేరా' అనే సినిమాలో నటిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.