టాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోల డాన్స్ విషయంలో ఆడియన్స్ కి అంచనాలు ఉంటాయి. పాటల్లో వారి సిగ్నేచర్ మూమెంట్స్ ఉండాలని కోరుకుంటారు. వారి అభిమాన నటుడు వెండితెరపై వేసే స్టెప్పుల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అందుకే కొరియోగ్రాఫర్లు చాలా కేర్ తీసుకుంటారు. ఈ విషయంలో ఎన్టీఆర్ కి హీరోయిన్ రాశిఖన్నా షాక్ ఇచ్చిందట.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'.. బాలయ్యకి స్పెషల్ ట్రీట్మెంట్..?

స్టెప్పులన్నీ తారక్ కే ఇస్తారేంటి..? నేను కూడా డాన్స్ చేస్తా.. నాకు కూడా స్టెప్స్ ఇవ్వండి అంటూ డిమాండ్చేసిందట. దీంతో ఎన్టీఆర్ షాక్ అయ్యాడట. ఈ విషయాన్ని రాశిఖన్నా  స్వయంగా వెల్లడించింది. సాయి ధరం తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన 'ప్రతిరోజూ పండగే' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశిఖన్నా ఈ విషయాలను వెల్లడించింది.

'జై లవకుశ' సినిమా సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినిమాలో ఓ పాట చిత్రీకరిస్తున్న సమయంలో తనకు కూడా సిగ్నేచర్ స్టెప్స్ కావాలంటూ  పట్టుబట్టిందట రాశిఖన్నా. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కొన్ని డాన్స్ మూమెంట్స్ ను తను కూడా చేస్తానని మొండిపట్టు పట్టిందట.డాన్స్ విషయంలోనే కాదు.. యాక్టింగ్-డైలాగ్స్ లో కూడా రాశిఖన్నా ఇలానే వ్యవహరిస్తుందట.

సీన్ లో తనకు ఏమాత్రం ప్రాధాన్యత తగ్గినా.. డైలాగ్స్ తగ్గినా వెంటనే డైరెక్టర్ దగ్గరకి వెళ్లి అడుగుతుందట. అంతేకాదు.. కొన్ని సార్లు తోటి ఆర్టిస్ట్ ల డైలాగ్స్ కూడా తనే చెప్పేస్తుంటుందని హీరో సాయి ధరం తేజ్ అన్నారు. 'సుప్రీమ్' సినిమాలో బెల్లం శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా బాగా చేసిందని, అందుకే ప్రతిరోజూ పండగే సినిమాలో ఏంజెలినా పాత్రకు ఆమె సూట్ అవుతుందని తనే రిఫర్ చేశానని తెలిపాడు సాయి ధరం తేజ్. డిసంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.