'మ‌ద్రాస్ కేఫ్' చిత్రంతో హీరోయిన్‌ గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన రాశీఖ‌న్నా తెలుగులో `ఊహాలు గుస‌గుస‌లాడే` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత తెలుగులో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంది. ఇప్పుడు తెలుగుతో పాటు త‌మిళంలోనూ సినిమాల‌ను చేస్తూ బిజీ హీరోయిన్‌ గా మారింది.

కోలీవుడ్ లో వరుసగా హిట్లు అందుకుంటుంది. 'ఇమైకా నొడిగళ్‌','అడంగమరు', 'అయోగ్య ' వంటి చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్ గా విజయ్ సేతుపతితో కలిసి నటించిన 'సంఘతమిళన్‌' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

కోరికలు తీర్చమని అడిగేవారు.. లొంగలేదని.. ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలో రాశిఖన్నా ఓ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తను కమర్షియల్ కథా పాత్రల్లో నటిస్తున్నట్లు, మంచి సామాజిక బాధ్యత కలిగిన పాత్రల్లో నటించాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చింది. గ్లామర్ విషయంలోనూ తనకంటూ హద్దులు ఉన్నాయని చెప్పింది.

అందుకే గ్లామరస్ పాత్రల్లో నటించమని కొందరు దర్శకులు ఒత్తిడి చేసినా ఆ పాత్రల్లో నటించడానికి అంగీకరించలేదని తెలిపింది. భవిష్యత్తులో మంచి సందేశాత్మక చిత్రాలలో  నటిస్తానని చెప్పింది.

తనను అందరూ డేటింగ్ గురించి అడుగుతున్నారని.. 16వ ఏటలోనే ఓ అబ్బాయితో డేటింగ్ చేశానని చెప్పింది. ఆ కుర్రాడి వయసు కూడా అప్పుడు 16 ఏళ్లేనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మూడు చిత్రాల్లో నటిస్తోంది.