సినిమా ఇండస్ట్రీలో మోసాలు జరగడం, ఒకరిపేరు చెప్పి మరొకరు నమ్మించి ట్రాప్ చేయడం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో ఉదంతం చోటు చేసుకుంది. సినీ దర్శకుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరుతో 'రాహు' సినిమా హీరోయిన్ క్రితి గార్గ్ కి ఫేక్ కాల్ వచ్చింది.

రాజకీయాలకు పనికిరాదని చిరుకి అప్పుడే చెప్పా : అల్లు అరవింద్

ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేయాలని, కథ వినడానికి ముంబై రావాలని  అజ్ఞాతవ్యక్తి హీరోయిన్ క్రితిగార్గ్ ని ఆహ్వానించాడట. దాంతో అతని మాటలు నమ్మిన క్రితి ముంబై బయలుదేరి వెళ్లారని.. అయితే, ముంబై వెళ్లిన తరువాత కృతి ఫోన్ నెంబర్‌ సోమవారం ఉదయం నుంచి కలవడం లేదని 'రాహు' దర్శకుడు సుబ్బు వేదుల పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

క్రితి గార్గ్ నటించిన 'రాహు' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.