రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ డమ్ అందుకుంటున్న విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక ప్రత్యేకమైన గెటప్ తో ఈ స్టార్ హీరో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. పూరి సినిమాల్లో హీరోల స్వభావం ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

తన సినిమాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన పూరి ఇప్పుడు విజయ్ దేవరకొండను కూడా తనదైన శైలిలో సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నాడు. ఇక సినిమాకు ఫైటర్ అనే టైటిల్ ని సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు గెటప్స్ పై స్క్రీన్ టెస్ట్ చేసిన విజయ్ ఫైనల్ ఒక లుక్ తో పూరీని మెప్పించినట్లు సమాచారం. విజయ్ గత సినిమాలకంటే ఫైటర్ సినిమాలో బాడీ లాంగ్వేజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట.

విజయ్ దేవరకొండ పేరు మార్పు.. కారణం ఫ్లాపులా, భక్తా ?

ఇండియాలోనే మోస్ట్ ఫెమస్ హెయిట్ స్టైలిస్ట్.. హకీమ్ అలీమ్ తో కూడా విజయ్ లుక్ ని టెస్ట్ చేయించినట్లు సమాచారం. ఫిట్ నెస్ లో కూడా చాలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా విజయ్ తన సరికొత్త స్టైల్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి సిద్దమవుతున్నాడు.  ఇకపోతే ఈ కథను ఫ్యాన్ ఇండియన్ లెవెల్లో అప్గ్రేడ్ చేస్తున్నారట. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ఫుల్ స్క్రిప్ట్ ను పూరి రెడీ చేస్తున్నాడు.

హిందీలో కూడా ఈ సినిమాని భారీగా రిలీజ్ చేయడానికి కరణ్ జోహార్ ఫైటర్ టీమ్ తో కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఏ సారి ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని విజయ్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. మరి అతని ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.        ఇక ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేసి సమ్మర్ అనంతరం సినిమాను విడుదల చేయాలనీ పూరి జగన్నాథ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.