డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. అప్పటివరకు పూరిని కొన్ని ఫ్లాపులు వేధించాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి జగన్నాధ్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే పాన్ ఇండియా చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఫైటర్ తర్వాత పూరి జగన్నాధ్ మరో పాన్ ఇండియా ఫిలింకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం కారణంగా ఓ స్టార్ హీరోతో పూరి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

ఐశ్వర్యారాయ్, అభిషేక్ ఆస్తుల చిట్టా.. వాటి గురించి తెలిస్తే దిమ్మతిరుగుద్ది

ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో పూరి జగన్నాధ్ సదరు హీరోకి వీడియో కాల్ ద్వారా ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ చర్చలు జరుపుతున్నట్లు టాక్. లాక్ డౌన్ తర్వాత ఈ చిత్రానికి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

చాలా కాలంగా పూరి జగన్నాధ్ జనగణమన అనే చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. భారీ స్థాయిలో ఉండే ఈ చిత్రం కోసం సరైన హీరోని పూరి వెతుకుతున్నారు. బహుశా ప్రస్తుతం పూరి సంప్రదింపులు జరుపుతోంది ఈ చిత్రం గురించేనేమో.