విజయ దేవరకొండ తను  పనిచేసే సినిమాల్లో ఇంటర్ ఫియర్ అవుతారని చెప్తూంటారు. ముఖ్యంగా ఆయన క్రియేటివ్ సైడ్ కొన్ని ఆలోచనలను షేర్ చేస్తూ స్క్రిప్టులో మార్పులు, చేస్తారని టాక్. అవి వర్కవుట్ అయిన సందర్బాలు కూడా ఉన్నాయి. అయితే డియర్ కామ్రేడ్ లో విజయ్ చెప్పిన స్ట్రాటజీ వర్కవుట్ కాలేదట. ఆ స్క్రిప్టు మొదట అనుకున్నది వేరే విజయ్ మార్చింది వేరే. అయితే దర్శకుడు ఇష్టపడినప్పుడు హీరో ఏం చేసినా  ఫర్వాలేదు..ఇబ్బందీ లేదు. కానీ ఇప్పుడు విజయ్ ఇన్ పుట్స్ తీసుకోవటానికి పూరి ఇష్టపడటం లేదట.

(2010-2019) కథలతో షాక్ ఇచ్చిన సినిమాలు.. హిట్టు, ఫట్టూ రెండూ!

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విజయంతో జోరుమీదున్నారు మాస్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌. యంగ్ హీరో విజయ్‌ దేవరకొండతో త్వరలో ‘ఫైటర్‌’ టైటిల్ తో ఓ  సినిమా చేస్తున్నారు. జనవరి 2020 నుంచీ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ భాక్సర్ గా కనిపించనున్నారు. ఎప్పటిలాగే విజయ్ దేవరకొండ తన వైపు నుంచి ఈ స్క్రిప్టులో కలపమంటూ కొన్ని సన్నివేశాలు చెప్పారట. అలాగే కొన్ని డైలాగులు కూడా వినిపించారట. అయితే పూరి జగన్నాథ్ మొహమాటం లేకుండా నో చెప్పేసారట. క్రియేటివ్ సైడ్ ఇన్వాల్వ్ కావద్దని అన్నారట.

ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. హీరోల‌ను మాస్ యాంగిల్‌లో తెర‌పై ప్రెజెంట్ చేసే పూరి జ‌గ‌న్నాథ్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ను తీసుకుంటారని టాలీవుడ్‌లో వార్త గత కొంతకాలంగా హల్‌చల్‌ చేస్తోంది.
 
ఇత పూరీ చాలా ఏళ్ల తర్వాత ఇటీవల ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో మంచి హిట్‌ కొట్టారు. విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’తో జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. భరత్‌ కమ్మా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్  పాత్ర పోషించారు. దీని తర్వాత తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై తెరకెక్కిస్తున్న ‘హీరో’లో విజయ్‌ నటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజుల షూటింగ్‌ జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.