ప్రపంచానికి పెను సవాలుగా మారిన కరోనా వైరస్ నిర్మూలనకు అన్ని దేశాలు నడుం బిగించాయి. ఇండియాలో కూడా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట  చర్యలకు ఉపక్రమించాయి. ఆదివారం రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు జనతా కర్ఫ్యూకి ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. 

కర్ఫ్యూలో భాగంగా, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఇటువంటి పరిస్థితుల్లో కూడా వైద్య బృందాలు 24 గంటల సేవలు అందితునందుకు గాను వారికీ సంఘీభావంగా సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి గుమ్మలవద్దకు వచ్చి చప్పట్లు కొట్టాలని మోడీ సూచించారు. 

పాలిటిక్స్ లోకి పవన్ హీరోయిన్ ?.. నవ్వినోళ్లే ఆలోచిస్తున్నారు..

దీనిపై టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.. ఏ దేవుడూ మనల్ని కాపాడలేడు. అందుకే గుళ్ళు గోపురాలు అన్నీ మూసేశారు. మనల్ని మనమే కాపాడుకోవాలి. అందుకే జనతా కర్ఫ్యూలో భాగంగా 5 గంటలకు ప్రతి ఒక్కరం చప్పట్లు కొడదాం, గట్టిగా ఆరుద్దాం అని పూరి జగన్నాధ్ పిలుపునిచ్చారు. 

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశంలోని ప్రధాన ఆలయాలు, చర్చిలు, మసీదులని ప్రభుత్వం మూసేసిన సంగతి తెలిసిందే. 

పాలిటిక్స్ లోకి పవన్ హీరోయిన్ ?.. నవ్వినోళ్లే ఆలోచిస్తున్నారు..