ప్రణీత సుభాష్.. ఈ పేరు వినగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలోని బాపుగారి బొమ్మ అంటూ సాగే పాట గుర్తుకు వస్తుంది. నిజంగానే బాపుబొమ్మని పోలిన సోయగాలు ప్రణీత సుభాష్ సొంతం. గ్లామర్ ఉన్నప్పటికీ ప్రణీత సుభాష్ స్టార్ హీరోయిన్ల పోటీలో నిలవలేకపోయింది. 

అత్తారింటికి దారేది మినహా ప్రణీతకు సరైన సక్సెస్ లేదు. దీనితో ఇటీవల ప్రణీతకు మరింతగా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ప్రణీత హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ప్రణీతపై ఓ పుకారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందొ లేదో తెలియదు కానీ పుకారు రాయుళ్లు మాత్రం దీనిని బాగా వైరల్ చేస్తున్నారు. 

ప్రణీత త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది, బిజెపి పార్టీలో చేరబోతోందనేది ఆ వార్త సారాంశం. ఇలాంటి పుకారు వ్యాపించడానికి కారణం తాజాగా ప్రణీత హిందూమతం గురించి మాట్లాడడమే. తాజాగా ప్రణీత తన ట్విట్టర్ లో హిందూ మతం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

'హిందువులు రెండు చేతులతో నమస్కరించడం చూసి ఇతరులు నవ్వుకున్నారు. బయటనుంచి వచ్చి ఇంట్లోకి వెళ్లే ముందు చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుని వెళ్లడం చూసి నవ్వుకున్నారు. చెట్లని, పశువుల్ని పూజించడం చూసి నవ్వుకున్నారు. యోగాచేయడం చూసి నవ్వుకున్నారు. చనిపోయిన వారి భౌతిక కాయాలని దహనం చేయడం చూసి నవ్వుకున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యాక తలస్నానం చేయడంచూసి నవ్వుకున్నారు. 

అనసూయ హాట్ లుక్స్.. నడుము అందాలతో సెక్సీగా..

కానీ ఇప్పుడు నవ్వడం లేదు.. పైగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ అలవాట్లే ప్రపంచానికి శ్రీరామ రక్షగా మారుతున్నాయి. ఈ అలవాట్లే ఇండియాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందకుండా చేస్తున్నాయి. హిందూ అనేది మతం కాదు మన జీవన బాట అని ప్రణీత సుభాష్ సోషల్ మీడియాలో పేర్కొంది. 

ఇటీవల ప్రణీత హిందూతత్వం గురించి ఎక్కువగా మాట్లాడుతుండడం చూసి ఆమె బీజేపీలో చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో ప్రణీతనే సమాధానం చెప్పాలి.